రేపటి నుంచి తెరుచుకోనున్న రిజిస్ట్రార్ ఆఫీసులు - MicTv.in - Telugu News
mictv telugu

రేపటి నుంచి తెరుచుకోనున్న రిజిస్ట్రార్ ఆఫీసులు

May 4, 2020

Sub registrar offices open from tomorrow

లాక్ డౌన్ నియమాల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులను ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని రోజులు మూతపడి ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రేపు తెరచుకోనున్నాయి. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను తెరిచేందుకు ప్రభుత్వం సుముఖత తెలిపింది. లాక్ డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ద్వారా తిరిగి ఆదాయాన్ని పొందాలని చూస్తోంది. 

లాక్ డౌన్ నిబంధనలు  రిజిస్ట్రార్ ఆఫీస్ కు వచ్చే ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారికి కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజిస్ట్రార్ ఆఫీస్ కు వచ్చే వారు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలి. కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది.