గ్యాస్ సబ్సిడీ వస్తోంది..  ఎంతో తెలిస్తే షాక్ తింటారు! - MicTv.in - Telugu News
mictv telugu

గ్యాస్ సబ్సిడీ వస్తోంది..  ఎంతో తెలిస్తే షాక్ తింటారు!

August 3, 2020

Subsidy on domestic gas cylinders 

మూడు నెలలుగా వంటగ్యాస్‌పై సబ్సిడీ అందడం లేదని వార్తలు వస్తున్నాయి.  సబ్సిడీ పంపిణీ యంత్రాంగంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గ్యాస్ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వకపోవగంతో మరింత గందరగోళం ఏర్పడింది. కొన్నాళ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో సబ్సిడీ సిలిండర్ దాదాపు 900 వందల నుంచి రూ. 650కి చేరుకుంది. దీంతో  సబ్సిడీ ఎత్తేశారని చాలా మంది భావిస్తున్నారు. అయితే అది నిజం కాదు. తగ్గిన ధరల మేరకు సబ్సిడీని కూడా భారీగా తగ్గించారు. చాలా మందికి రూ.39 సబ్సిడీ కింద అకౌంట్లలో జమ చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని వినియోగదారులు ఏజెన్సీలను కోరగా.. సబ్సిడీ ఇవ్వడం లేదని సమాధానం చెబుతున్నారు. ఈ 39 చిల్లర ఏంటో అర్థం కాక జనం తల పట్టుకుంటున్నారు. ఇదివరకు సబ్సిడీ 200 వరకు వచ్చేది. గ్యాస్ ధర తగ్గడంతో ఈమేరకు తగ్గించారేమోనని సరిపెట్టుకుంటున్నారు. ఏడాదికి  12కు మించి సిలిండర్లు తీసుకుంటున్నట్లు రికార్డుల్లో నమోదైందేమోనని , అందుకే సబ్సిడీ అందడం లేదని కొందరు భయపడుతున్నారు. 

నిజానికి గ్యాస్ సబ్సిడీ వ్యవహారంలో పారదర్శకత లేదనే చెప్పొచ్చు. సబ్సిడీ సిలిండర్ మార్కెట్ ధర, సబ్సిడీ మొత్తాన్ని విడివిడిగా చూసితే దీనిపై స్పష్టత వస్తుందని ప్రజలు కోరుతున్నారు. దీనికి తోడు సిలిండర్ డెలివరీకి రూ. 30 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తున్నారు డెలివరీ బాయ్స్. వారికి అధికారింగా ఎంత చెల్లించాలన్నదానిపైనా స్పష్టత లేదు.