succesfull tribal women in jharkhand
mictv telugu

కట్నం చాల్లేదని విడాకులిచ్చిన భర్త.. పదేళ్ల తర్వాత చూస్తే షాక్

May 12, 2022

దాదాపు పదేళ్ల క్రితం మాట. కొత్తగా పెళ్లిచేసుకున్న భర్త మొదట్లో భార్యను బాగా చూసుకున్నాడు. తర్వాత కొద్ది నెలలకే తల్లితో కలిసి అదనపు కట్నం కావాలని భార్యను వేధించేవాడు. పేదవాడైన భార్య తండ్రి చేతులెత్తేశాడు. దీంతో మహిళకు విడాకులు తప్పలేదు. అలా విడాకులు తీసుకోవడమే ఆమెకు మంచిదైంది. పదేళ్ల తర్వాత తన స్వంత కష్టంతో ఎదిగి పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. వివరాలు.. జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌కు చెందిన మధుమితకు పెళ్లీడు రావడంతో తండ్రి ఓ సంబంధం చూసి పెళ్లిచేశాడు.

కొంతకాలానికి అదనపు కట్నం ఇవ్వలేదని భర్త మధుమితకు విడాకులిచ్చేశాడు. దాంతో మొదట్లో బాధపడిన మధుమిత తర్వాత సొంతంగా ఏదైనా చేయాలని గట్టిగా భావించింది. ఓరోజు చెక్కలతో కీ చెయిన్లు తయారు చేసే అమ్మేవారిని గమనించి వాటిని ఎలా తయారు చేస్తారో తెలుసుకుంది. క్రమంగా వాటిపై ఆసక్తి ఎక్కువై మరో ఇద్దరు మహిళకలకు శిక్షణనిచ్చింది. మెల్లగా చిన్న స్థాయిలో ప్రారంభమైన వారి వ్యాపారం క్రమంగా ఎదుగుతూ.. ఇప్పుడు తొమ్మిది నగరాలకు విస్తరించింది. ఇప్పుడామె దగ్గర 200 మంది గిరిజన మహిళలు పనిచేస్తున్నారు. నెలకు రూ. 5 లక్షల దాకా టర్నోవర్ సాధిస్తోంది. ఈ విజయం పట్ల మధుమిత సంతోషం వ్యక్తం చేసింది. తన జీవితంలో చేదు అనుభవం ఎదురైనా పని కల్పించడం ద్వారా ఇంతమంది మహిళల కుటుంబాల్లో ఆనందం నింపుతున్నాననే సంతృప్తి ఉందని భావిస్తోంది.