సుచరిత కీలక ప్రకటన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

సుచరిత కీలక ప్రకటన.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా

April 11, 2022

04

ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు ఆనందంగా కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే, మరోవైపు మాజీ మంత్రులు అసంతృప్తితో తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ మంత్రులు అయిన సుచరిత, బాలినేని శ్రీనివాస రెడ్డి గైహాజరు అయ్యారు. అంతేకాకుండా తనకు మంత్రి పదవి నిరాకరించడంపై అధిష్టానంపై మాజీ మంత్రి బాలినేని మండిపడ్డారు. ఇప్పటికే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, తనను నమ్మించి మోసం చేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేకమార్లు బుజ్జగించినప్పటికీ మెత్తబడని ఇరువురు నేతలు నేడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి మేకతోటి సుచరిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాకు సంబంధించిన ప్రకటనను కూడా సోమవారం ప్రకటించారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో రాజీనామా విషయాన్ని ఆమె వెల్లడించారు. అనంతరం పార్టీలోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. మిగతా క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయొద్దని సూచించారు. నాయకులు ఎవరూ పార్టీకి నష్టం కలిగించొద్దని విన్నవించారు. కాగా, సుచరితకు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు.