ఆవుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్న ఈగ విలన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆవుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్న ఈగ విలన్

November 26, 2022

శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తెలుగు వారికి సుపరిచితుడే. రాజమౌళి సినిమా ఈగలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే సుదీప్ ని బ్రాండ్ అంబాసిడర్ గా అక్కడి ప్రభుత్వం నియమించింది. ఆవుల సంరక్షణ కోసం కొత్తగా పుణ్యకోటి దత్తు యోజన్ అనే పథకాన్ని ప్రవేశపెట్టిన కర్ణాటక ప్రభుత్వం పథకం ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో సుదీప్ ని ఎంచుకుంది.

 

ఆవుల అక్రమ రవాణా, పశువధ నుంచి గోవులను కాపాడడమే ఈ పథకం లక్ష్యం. అంతేకాక, 31 జిల్లాల నుంచి ఒక్కో ఆవును సుదీప్ దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా సుదీప్ మాట్లాడుతూ.. ఆవుల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, సంబంధిత శాఖా మంత్రి ప్రభు చౌహాన్ లకు ధన్యవాదాలు తెలిపారు. పశువులను దత్తత తీసుకోవాలని తన అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారికి పిలుపునిచ్చారు. గోవుకు ఆహారం తినిపిస్తున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.