చాలా పెద్ద బ్యాగ్రౌండ్ ఉంది కానీ ఇప్పటివరకు సరైన విజయం మాత్రం లేదు సుధీర్ బాబుకి. తన వెనుక ఉన్న వెన్నదన్నును వాడుకోకుండా తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకోవడానికి ట్రై చేస్తున్నాడీ ఘట్టమనేని ఇంటి అల్లుడు. వెరైటీ సబ్జెక్ట్ లను ఎంచుకుంటూ వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
The WAIT (Weight) is OVER😊
'దుర్గ' అనే బరువైన పాత్రలో మీ దిల్ దోచేయడానికి వస్తున్నాడు! ❤️Introducing,@isudheerbabu as #DURGA from #MaamaMascheendra 💥@HARSHAzoomout @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/yqah9QAgPd
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 1, 2023
సుధీర్ బాబు చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో ఇప్పుడు కొత్త సినిమా మీద దృష్టి పెట్టాడీ ఈ హీరో. సుధీర్ బాబు ఎప్పుడూ తన ఫిట్ నెస్ మీద చాలా ఫోకస్డ్ గా ఉంటాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించే సుదీర్ బాబు తన కొత్త లుక్ తో అందరికీ షాక్ ఇస్తున్నాడు.
సుధీర్ బాబు హీరో గా, సినీ రచయిత, నటుడు అయిన హర్షవర్ధన్ డైరెక్షన్ లో మామా మశ్చీంద్ర అనే మూవీ వస్తోంది. దీని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో సుధీర్ బాబు చాలా లావుగా, బొద్దుగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆయన బెట్…ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు అంటూ పోస్ట్ రాసాడు. ఫస్ట్ లుక్ చూసిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. ఎవరూ ఊహించిన విధంగా అతను షాక్ ఇస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
మామా మశ్చీంద్ర సినిమాలో దుర్గ అనే పాత్రలో యాక్ట్ చేస్తున్నారు సుధీర్ బాబు. కొత్తగా ఉండే యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రానుందని చెబుతున్నారు మూవీ టీమ్. చేతన్ భరద్వాజ్ దీనికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకం మీద దీన్ని నిర్మిస్తున్నారు.