Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర నటుడైనా స్టార్ హీరోకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సుధీర్ కి. ఓ కామెడీ షో ద్వారా తన కామిక్ సెన్స్ తో కష్టపడి కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు సుధీర్. ప్రతి లెవెల్ లో తనలోని ప్రతిభను ప్రదర్శిస్తూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. ఎంత ఎత్తు ఎదిగినా మనకు చేయి అందించిన వారిని మాత్రం మరిచిపోకూడదు అని అనుకుంటాడు సుధీర్. అందుకే వీలుదొరికినప్పుడల్లా తనకు అవకాశం ఇచ్చిన వారి గురించి చెబుతూ వస్తుంటాడు. రీసెంట్ గా సుధీర్ తన లైఫ్ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్తను షేర్ చేసుకున్నాడు. తాను , తన ఫ్యామిలీ ఈ రోజు మూడు పూటలు తింటున్నామంటే అందుకు ఒకరే కారణం అని. తానే కనుక లేకపోతే సుధీరే లేడన్నాడు.
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ దగ్గర జరిగింది. తెలంగాణ యాసభాషలతో కొనసాగే ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య, కల్యాణ్ రామ్ లు నటించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు సుడిగాలి సుధీర్ హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో సుధీర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నేను ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం వేణు అన్ననే అని సుధీర్ చెప్పాడు. వేణు అన్న నన్ను ఆదరించడం వల్లనే నేను నా కుటుంబం ఇప్పుడు మూడు పూటలు తింటున్నామన్నాడు. ఆయనే కనుక జబర్దస్త్ లో ఛాన్స్ ఇవ్వకుంటే సుధీర్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదన్నాడు. వేణు అన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఈవెంట్ లో తెలిపాడు. తన విజయానికి కారణం వేణు ఇచ్చిన అవకాశమేనని ఎంతో గర్వంగా చెప్పాడు. సుధీర్ ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వేణును, సుధీర్ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
జబర్దస్త్ లో తనదైన శైలితో వేణు హాస్యనటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే వేణు లో కామిక్ సెన్సే కాదు మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. ఆ ప్రతిభను గుర్తించి దిల్ రాజు వేణుకు సినిమా తీసే ఛాన్స్ ఇచ్చాడు. అందుకు గాను సుధీర్ దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు. బలగం సినిమా చూసిన ప్రతీ ఒక్కరు తమ ఇంట్లోని వారితో కనెక్ట్ అవుతారని, మన అక్కాచెల్లెల్లను ఒక్కసారి చూడాలని వారితో మాట్లాడలని అనిపిస్తుందని చెప్పాడు సుధీర్. తప్పనిసరిగా మీ ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రం చూడండి మీకు నచ్చితీరుతుందన్నాడు.