sudigali sudheer gaalodu collections crossed jinnah movie total collections in one day
mictv telugu

మంచు విష్ణు పరువు తీసిన సుడిగాలి సుదీర్

November 19, 2022

జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ దక్కించుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. పండుగాడు, సాఫ్ట్ వేర్ సుధీర్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన సుధీర్ లేటెస్ట్ మూవీ గాలోడు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని బీ, సీ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నట్టు ట్రెండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. తొలిరోజు మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిన ఈ సినిమా సక్సెస్ మీట్ ని సైతం పెట్టేసింది గాలోడు టీమ్. అనధికార లెక్కల ప్రకారం గాలోడు తొలిరోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిందట.

తెలుగు రాష్ట్రాల్లో రూ.60 నుంచి రూ.70 లక్షల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనాలు వేసినా అంతకుమించి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ గాలొడీ లెక్కలను మంచు విష్ణు జిన్నాతో పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. జిన్నా మూవీ ఆల్ టైం వసూళ్లను గాలోడు మూవీ ఒక్క రోజులో క్రాస్ చేసి మంచు విష్ణుకి సుడిగాలి సుధీర్ షాక్ ఇచ్చాడని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మంచు విష్ణు కంటే సుధీర్‌కే ఫాలోయింగ్ ఎక్కువ ఉందని.. ఒక అప్ కమింగ్ హీరో సుధీర్ చేతిలో మంచు విష్ణు చతికిలపడ్డాడని.. ఇది నిజంగా గొప్ప విషయమంటున్నారు. అయితే గాలోడు మూవీకి ఆంధ్రాలో రూ.47 లక్షలు, నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షల గ్రాస్ వసూళ్లు వస్తే.. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.01 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.