sudigali sudheer gaalodu movie collection teaching lessons to star heroes
mictv telugu

ఇండస్ట్రీకి గాలోడి షాక్.. కళ్లు తెరిపిస్తున్న సుడిగాలి సుధీర్

November 24, 2022

ప్రేక్షకులకు అభిరుచులను కరోనా పూర్తిగా మార్చేసింది. సినీ ప్రేక్షకుల సెలక్షన్‌లో భారీ మార్పులు వచ్చాయి. అభిమాన హీరోల మూవీ థియేటర్లో పడగానే అప్పటిలా పొలోమని పరిగెత్తటం లేదు ఫ్యాన్స్. టాక్, కంటెంట్ ఆధారంగా మూవీని చూస్తున్నారు. దీంతో సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చూస్తున్నారు. దీనికి పెరిగిన టికెట్ల ధరలు ఒక కారణమైతే.. ఓటీటీ కల్చర్ రావటం కూడా మరో మెయిన్ రీజన్. థియేటర్స్ ఆక్యుపెన్సీ 50 శాతానికి పడిపోవటంతో.. బిజినెస్ భారీగా తగ్గింది. ఇదే సమయంలో కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు పట్టం కట్టడం మొదలు పెట్టారు. డిఫరెంట్ కథ ఉంటే చాలు హీరో, భాషని లెక్కపెట్టడం లేదు. దీనికి ప్రధాన ఉదాహరణ ‘కాంతార’. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిచింది. ప్రపంచవ్యాప్తంగా 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పటివరకు రిషబ్ శెట్టి ఎవరో తెలీదు. పాన్ ఇండియా బ్రాండ్ ఉన్న ఒక్క ఆర్టిస్ట్ సినిమాలో లేడు. కానీ కాంతార అన్ని లెక్కలను మార్చేసింది. ఇక ఇదే సమయంలో ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న సల్మాన్ ఖాన్, చిరంజీవి వంటి సూపర్ స్టార్స్ నటించిన ‘గాడ్‌ఫాదర్’ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయలేకపోయింది గాడ్ ఫాదర్.

కంటెంట్ లేకపోతే చిరు సినిమా అయినా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదని ఆచార్య, గాడ్‌ఫాదర్ నిరూపించాయి. మాస్ బొమ్మలుగా విడుదలైన కాంతార వలె మ్యాజిక్ చేయలేపోయింది గాడ్‌ఫాదర్. కానీ సుడిగాలి సుధీర్ వంటి చిన్న హీరో నటించిన మరో మాస్ బొమ్మ ‘గాలోడు’ మాత్రం ఊహకందని విధంగా వసూళ్లని రాబడుతూ ఆశ్చర్యపరుస్తోంది. మౌత్ టాక్ లేదు, ప్రమోషన్స్ లేవు కానీ తొలివారం ముగియకుండానే మూడు కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కుమ్మేసింది గాలోడు చిత్రం. ఇది ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కి గురిచేస్తుంది. అట్టట్ట ఉన్న ఈ మూవీకే ప్రేక్షకులు ఈ రేంజ్ వసూళ్లని కట్టబెడితే ఆకట్టుకునే మాస్ బొమ్మ పడితే ఫలితం ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.  `గాలోడు` సినిమా మన వాళ్ల కళ్లు తెరిపిస్తోందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. థియేటర్ లో ఆడియన్స్ చేతి విజిల్స్ వేయించగలిగే మాస్ మసాలా బొమ్మ పడాలే కానీ ఆ లెక్క వేరేలా వుంటుందని సుడిగాలి సుధీర్ నటించిన `గాలోడు` హింట్ ఇస్తోందని అంటున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న చిరు `వాల్తేరు వీరయ్య` బాలయ్య `వీరనరసింహారెడ్డి` మాస్ జనాల్లో పూనకాలు తెప్పించగలిగిలే పోటీలో ఏ బొమ్మ వున్నా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గ్యారంటీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.