sudigali sudheer gaalodu movie collections
mictv telugu

సుధీర్ క్రేజ్ ని డబుల్ చేసిన.. గాలోడు షాకింగ్ కలెక్షన్స్..!

November 20, 2022

చిన్న కమెడియన్ గా జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి.. టీమ్ లీడర్ గా సత్తా చాటి.. రష్మి ట్రాక్ తో క్రేజ్ దక్కించుని.. వరుసగా సినిమాలపై సినిమాలు చేస్తూ హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. అయితే సుధీర్ మొదటి రెండు సినిమాలు సాఫ్ట్ వేర్ సుధీర్, పండుగాడు మూవీస్ పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో భారీ అంచనాల నడుమ గాలోడు మూవీతో మనముందుకు వచ్చాడు సుధీర్. మొన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ రావటం ఇండస్ట్రీ వర్గాలని విస్మయానికి గురిచేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రాలో కొన్ని బీ, సీ సెంటర్స్ లో అయితే హౌస్ ఫుల్ బోర్డులు కూడా వెలిశాయట. హిట్ టాక్ వచ్చిన గాడ్ ఫాదర్, యశోద వంటి బడా స్టార్స్ మూవీలనే జనాలు లైట్ తీసుకుంటుంటే.. సుధీర్ గాలోడు మూవీకి బీ, సి థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడాయి.

ఇక మొదటి రోజు కలెక్షన్స్ లో గాలోడు సత్తా చాటింది. ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా గ్రాస్ కొల్లగొట్టి.. సుధీర్‌ కెరీర్‌లోనే టాప్ మూవీగా నిలిచింది. ఆంధ్రాలో 47 లక్షలు, నైజాంలో 36 లక్షలు, సీడెడ్‌లో 18 లక్షల రూపాయల కలెక్షన్స్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.01 కోట్ల రూపాయల వసూళ్లు చేస్తే.. 1.05 కోట్ల రూపాయలతో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఎవరు ఊహించని స్థాయిలో గాలోడు సినిమాకు బెస్ట్‌ కలెక్షన్లు రావటంపై సుధీర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుండి అందరు స్టార్ హీరోల ఫస్ట్ డే కలెక్షన్స్ మాదిరి.. మా సుధీర్ అన్న సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ పై కూడా చర్చ నడుస్తుందని సంతోష పడుతున్నారు. ఏదేమైనా గాలోడు మూవీ సుధీర్ క్రేజ్ ని బాక్సాఫీస్ దెగ్గర రెట్టింపు చేసిందనే చెప్పాలి. మంచి కమర్షియల్ సినిమా ఒక్కటి కానీ పడితే.. మాస్ హీరోగా సుధీర్ ఇండస్ట్రీలో నిలిచిపోతాడని అంటున్నారు.