sudigali sudheer won on allu arjun in online polling
mictv telugu

ఓటింగ్ లో బన్నీకి షాక్.. సుడిగాలి సుధీర్ సంచలనం

November 21, 2022

పుష్పతో బన్నీ రేంజ్ దేశవ్యాప్తమైతే.. జబర్దస్త్ తో తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతాడు సుడిగాలి సుధీర్. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదగడానికి అల్లు అర్జున్ కి కొన్నేళ్లు పట్టింది. మెగా ఇమేజ్ కి తోడు గొడ్డు కష్టం బన్నీని ఈ స్థాయికి చేర్చింది. 2003లో గంగోత్రితో సినీ ఎంట్రీ ఇచ్చిన బన్నీ 2022లో ఐకాన్ స్టార్ గా బిరుదు పొందాడు.అంటే అల్లు అర్జున్ ఈ స్థాయికి రావటం వెనుక సుమారుగా 20ఏళ్ళ కష్టం దాగుంది. మెగా హీరోల నీడ నుండి బయటికొచ్చి సొంత కష్టంతో ఎదిగాడన్న పేరు కూడా బన్నికుంది. అందుకే బయటే కాదు సోషల్ మీడియాలోనూ బన్నీకి సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. తన క్రేజ్ ని పెంచడానికి బన్నీ ఫ్యాన్స్ సైన్యంలా పనిచేస్తారు. బన్నీ సినిమా అప్డేట్స్, వ్యక్తిగత విషయాలకు లక్షల్లో వ్యూస్ వస్తాయి. అలాంటి బన్నీకి తాజాగా సోషల్ మీడియాలో షాక్ ఇచ్చాడు సుడిగాలి సుధీర్.

‘గాలోడు’ మూవీతో కెరీర్ లో తోలి హిట్ కొట్టిన సుధీర్ సోషల్ మీడియాలో తన జోరును కొనసాగిస్తున్నాడు. బన్నీ, సుధీర్ లలో ఎవరు బెస్ట్ అని పెట్టిన ఒక పోలింగ్ లో సుధీర్ సంచలనం సృష్టించాడు. నిజానికి.. 100కోట్ల మార్కెట్ ఉన్న బన్నీకి సుధీర్ కి పోలిక లేకున్నా.. కొందరు యాంటీ బన్నీ ఫ్యాన్స్ ఈ ఆన్ లైన్ పోలింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోలింగ్ లో ‘మీకు ఎవరంటే ఇష్టం.. ఓపెన్‌గా చెప్పండి’ అని అడుగుతే.. 43వేల మంది నెటిజన్స్ ఓటింగ్ లో పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా సుడిగాలి సుధీర్‌కు 69 శాతం ఓట్లు రాగా.. అల్లు అర్జున్‌కు కేవలం 31 శాతం ఓట్లు మాత్రమే రావటం గమనార్హం. దీన్ని స్క్రీన్ షాట్ తీసి కొంత మంది ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇదేం క్రేజ్ అంటూ సుధీర్‌‌‌ను కొనియాడుతున్నారు. యూట్యూబ్‌లో పెట్టిన పోల్ కింద సైతం సుధీర్‌కు అనుకూలంగానే ఎక్కువ కామెంట్లు వచ్చాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సుధీర్ ఎదిగాడని.. అందుకే తమకు సుధీర్ అంటేనే ఇష్టమని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.