సుడోకును మనోళ్లు 300 ఏళ్లకిందటే ఆడారు.. - MicTv.in - Telugu News
mictv telugu

సుడోకును మనోళ్లు 300 ఏళ్లకిందటే ఆడారు..

March 28, 2018

అంకెల ఆట సుడోకు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. గడుల్లో అంకెలు నింపి ఎటు నుంచి ఎటు కూడినా ఒకే మొత్తం రావాలి ఆటలో. మరి ఈ ఆటను ఎవరు కనిపెట్టారు? జపాన్ వాళ్లని కొందరు, ఫ్రెంచివాళ్లని కొందరు అంటారు. 19వ శతాబ్దిలో ఫ్రెంచి పత్రికల్లో ఇలాంటి పజిల్స్ వచ్చేవి. అయితే 1979 నుంచే పక్కా సుడోకు పజిల్స్ జపాన్‌లో మొదలయ్యాయి. ఇంతవరకు మనకు తెలిసింది ఇంతే. అయితే తమిళనాడులోని ఓ గుడిలో ఉన్న స్తంభం ఈ చరిత్రను తిరగరాస్తోంది.సుడోకు మొదటిసారిగా ఆడింది భారతదేశంలోనే అని ఈ స్తంభంపై ఉన్న గళ్లు చెబుతున్నారు. పళని కొండల దిగువన ఉన్న ఆలయ మంటపంలో ఈ స్తంభం ఉంది. దీనిపై తొమ్మిది గళ్లు, తమిళ అంకెలు ఉన్నాయి. ఈ స్తంభాన్ని17వ శతాబ్దిలో చెక్కారని పురాతత్వ శాస్త్రవేత్త నారాయణ మూర్తి తెలిపారు. స్తంభంపై ఉన్న తొమ్మిది గడుల్లోని అంకెలు ఎటువైపు నుంచికూడా 15 అంకె వస్తుందని, ఇది సుబ్రహ్మణ్య స్వామి సంఖ్య అని తెలిపారు. ఉత్సవాల సమయంలో దేవడి విగ్రహాన్ని ఈ స్తంభం ముందు నిలుపుతారు. ఇలాంటి స్తంభాలు దక్షిణాదిలో చాలా ఉండొచ్చని, పూర్తి అధ్యయనం తర్వాత సుడోకు మనదే అని తేల్చవచ్చని ఆయన పేర్కొన్నారు.

(Thenewsminute సౌజన్యంతో)