పదహారేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నా : కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

పదహారేళ్లుగా డయాబెటీస్‌తో బాధపడుతున్నా : కేటీఆర్

March 5, 2022

21

తనకు షుగర్ వ్యాధి ఉందని పదహారేళ్ల క్రితమే తెలిసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. శనివారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి ప్రభుత్వం నిర్వహిస్తున్న హెల్త్ ప్రొఫైల్‌ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఇంటికి బృందాలు వస్తాయి. ప్రతీ ఒక్కరి పొడవు, బరువు, బీపీ, షుగర్, గుండె, కిడ్నీ
లకు సంబంధించిన వివరాలను తీసుకుంటారు. కంటి, రక్త పరీక్షలు చేస్తారు. అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లొడ్ చేస్తారు. ఇలా హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం వల్ల ఏ హాస్పిటల్‌కి వెళ్లినా ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్య వివరాలన్నీ ఉంటాయి’ అని వివరించారు. అంతే కాక, వీటి వల్ల కలిగే లాభాలను పేర్కొంటూ.. తనకు డయాబెటీస్‌ ఉందనే విషయం ఇలా సాధారణ చెకప్ చేయించుకోవడం వల్లే తెలిసిందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మరోవైపు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి, లబ్దిదారుల చేత గృహ ప్రవేశం చేయించారు.