సముద్రంలో చక్కెర కొండలు.. నిల్వలెంతో షాక్.. - MicTv.in - Telugu News
mictv telugu

సముద్రంలో చక్కెర కొండలు.. నిల్వలెంతో షాక్..

May 24, 2022

అవును.. మీరు చదివింది నిజమే. సముద్రంలో చక్కెర గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉంది. 130 కోట్ల టన్నుల చక్కెర నిల్వలు సముద్ర గర్భంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నిల్వలు గతంలో ఊహించినదానికంటే 80 రెట్లు ఎక్కువ. సముద్ర గర్భంలో సీగ్రాస్(నాటు, మొక్కలు)లో చక్కెర మూల పదార్థమైన సుక్రోజ్ నిల్వలు భారీగా ఉన్నట్లు జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెరైన్ మైక్రోబయాలజీ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఈ సుగర్ నిల్వలు ఇదివరకు ఇంకా పెద్ద మొత్తంలో ఉండేవని, వాతావరణ మార్పులు వల్ల కరిగిపోయాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సీగ్రాస్ నుంచి విడుదలయ్యే సుక్రోజ్ సముద్ర గర్భంలో కలిసిపోయి నిల్వలుగా మారుతుందని వెల్లడించారు. సీగ్రాస్ అంతరించిపోతే సముద్ర గర్భంలోని కార్బన్ డైయాక్సైడ్ భారీగా వెలువడి పర్యావరణానికి హాని చేస్తుందని హెచ్చరించారు.