అయ్యప్ప దీక్షలో ఉన్నా చెప్పులు ఎందుకంటే.. అవంతి వివరణ - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప దీక్షలో ఉన్నా చెప్పులు ఎందుకంటే.. అవంతి వివరణ

November 19, 2019

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ అయ్యప్ప మాల ధరించి చెప్పులు ధరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అయ్యప్ప మాల ధరించి చెప్పులు ఎలా ధరిస్తారు?  ఇది హిందువుల మనోభావాలను కించపరచడమే అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై మంత్రి స్పందించారు. హిందూ మతాన్ని గౌరవించడంలో తన తర్వాతే ఎవరైనా అని అన్నారు. ఆరోగ్య సమస్యలతోనే చెప్పులు వేసుకున్నట్లు తెలిపారు. 

Avanti Srinivas.

‘నాకు డయాబెటిస్ ఉంది కాబట్టే చెప్పులు వేసుకుంటున్నాను. కుట్రలో భాగంగానే నాపై ఆరోపణలు చేస్తున్నారు.నేనున  టీడీపీ ఎంపీగా ఉన్న సమయంలోనూ మాల ధరించాను.. అప్పుడు కూడా చెప్పులు వేసుకున్నాను. మాజీ ఎంపీ మురళీమోహన్ కూడా అయ్యప్ప దీక్షలో  చెప్పులు ధరించారు.. ’ అని చెప్పారు.