కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 25 మంది విద్యార్ధుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 25 మంది విద్యార్ధుల మృతి

April 19, 2022

05

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబర్లతో రెచ్చిపోయారు. షియాల జనాభా ఎక్కువగా ఉన్న నగర పశ్చిమ ప్రాంతంలో ఉన్న స్కూలు వద్ద జరిగిన దాడిలో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది. ముంతాజ్ ఎడ్యుకేషన్ సెంటర్, అబ్దుల్ రహీం షాహిద్ స్కూళ్ల వద్ద ఈ పేలుళ్లు జరిగాయి. మూడు నుంచి ఐదు వరకు ఆత్మాహుతి బాంబర్లు దాడి చేయగా, వీరిలో ఇద్దరు మాత్రమే బాంబులు పేల్చారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ దాడులపై ఆఫ్ఘన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల కమిటీ నిర్ధారించింది. ఘటనలపై దర్యాప్తు ప్రారంభించామని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు. కాగా, ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థా ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ, అందరి అనుమానం ఐసిస్ మీదే ఉంది.