ఏపీ సచివాలయంలో ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీ సచివాలయంలో ఆత్మహత్య

August 19, 2017

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో  ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన అప్పుల బాధలు చెప్పుకోవడానికి శుక్రవారం నుంచి వెలగపూడిలోని సచివాలయంలో CM చంద్రబాబు కోసం పడిగాడుపులు కాసిన నెల్లూరు జిల్లావాసి రాజ్ గోపాల్ కు సీఎం దర్శన భాగ్యం దొరకలేదు.

నిరాశానిస్పృహలకు గురైన రాజ్ గోపాల్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రికి ఇలాంటి సామాన్యుల బాధలు పడతాయా? ఆ విషయం తెలిసి ఉంటే రాజ్ గోపాల్ బతికిపోయేవారేమో మరి.