గుడి పక్కనున్న ఈద్గాను తీసేయాలని కోర్టుకు.. - MicTv.in - Telugu News
mictv telugu

గుడి పక్కనున్న ఈద్గాను తీసేయాలని కోర్టుకు..

September 26, 2020

Suit moved in Mathura court over Krishna Janmabhoomi

అయోధ్యలో రామమందిర వివాదం ఓ కొలిక్కి వచ్చింది. అక్కడ రామాలయ నిర్మాణం కూడా ప్రారంభం అయింది. ఆ వివాదం పూర్తయిందో లేదో వెంటనే మరో వివాదం తెరపైకి వస్తోంది. ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కొత్త వివాదం మొదలైంది. శ్రీకృష్ణ జన్మస్థానం అయిన మథురలో శ్రీకృష్ణ ఆలయానికి చెందిన 13.37 ఎకరాల భూమిని తిరిగి పొందాలని బాలదేవత భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ ట్రస్టు ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణానికి ఆనుకొని ఉన్న షాహి ఈద్గాను తొలగించాలని కోరుతూ బాలదేవత భగవాన్ శ్రీకృష్ణ విరాజ్మాన్ ట్రస్ట్ కోర్టుకి వెళ్ళింది. ఈ మేరకు ట్రస్ట్ సభ్యురాలు రంజనా అగ్నిహోత్రి మథుర సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో సివిల్ దావా వేశారు. ఈ దావాలో ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, షాహి ఈద్గా ట్రస్టు మేనేజ్‌మెంట్ కమిటీలను ప్రతివాదులుగా చూపారు. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్‌.. ఈద్గా ట్రస్టు మేనేజ్‌మెంట్ కమిటీతో మోసపూరితంగా రాజీ కుదుర్చుకుందని పిటీషన్‌లో ఆమె ఆరోపించారు.