నిరుపేదల వైద్యానికి భరోసా సూట్స్ ! - MicTv.in - Telugu News
mictv telugu

నిరుపేదల వైద్యానికి భరోసా సూట్స్ !

August 17, 2017

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దవాళ్లు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ తపన పడ్తుంటారు.కానీ ఇక్కడ తేడా వచ్చేది ఎక్కడంటే ఉన్నవాడు బాగానే తన ఆరోగ్యం కోసం మంచి  మంచి ఫుడ్స్ తీస్కుంటాడు.ఏదైనా జబ్బొస్తే సకాలంలో హాస్పిటల్ కు వెళ్ళి వైద్యం చేయించుకొంటాడు. కానీ లేనివాడి పరిస్థితేంది ? అతను తినడానికి ఏగాలి ? ఏదైనా జబ్బొస్తే హాస్పిటల్ కు వెళ్ళడానికి ఏగాలి. అలా చాలా మంది గరీబోళ్ళు డక్కామొక్కీల బతుకులీడుస్తూ ఆరోగ్యం పాడై, హాస్పిటళ్లలో చూపించుకోలేక అర్థాంతరంగా తనువులు చాలిస్తున్నారు ??గవర్నమెంట్ హాస్పిటళ్ళలో సరైన వైద్య సదుపాయలు లేక, డాక్టర్ల నిర్లక్ష్యంతో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు ?ఎందుకిలా ? ఎంతకాలమిలా ? విధి ఎప్పుడూ బీదోళ్ళనే వెక్కిరించాలా ? విధికి ధనవంతుడు ప్రియతముడా ? అందుకేఅలాంటి నిరుపేదల పాలిట వెన్నుదన్నుగా నిలవాలనుకున్నది ఒక సంస్థ. ఆ అభ్యుదయ సంస్థే ‘ సూట్స్ ’ ( సాధనా యూనిట్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ ). ఈ సంస్థ గురించి, దాని పూర్వాపరాల గురించి ఏక్ నజర్ వేద్దామా…

సూట్స్ 

ఈ రోజుల్లో డబ్బు లేని వాడంటే ప్రతీ ఒక్కరికీ అలుసే. మరీ ముఖ్యంగా హాస్పిటళ్ళల్లో పైసాలేకుండా ఫుక్కట్ల అస్సలు వైద్యం చెయ్యరు. కార్పోరేట్ వైద్యాలన్నీ ఉన్నవాడికి కూతవేటు రూరంలోనే వుంటాయి. లేనివాడు ఎన్ని ఆర్తనాదాలు పెట్టినా ఏ కార్పోరేట్ ఆస్పత్రీ స్పందించదు. విద్యతో పాటు వైద్యం కూడా పెద్ద వ్యాపారమైన రోజుల్లో వున్నది ఆధునిక వ్యవస్థ. అలా ఎందరో వైద్యానికి చేతిలో చిల్లిగవ్వా లేక చనిపోతున్నారు. ఈ పాపం ఎవ్వరిది ? పేదరికానిదా ? వైద్యులదా ? డబ్బుదా ? కారణాలు ఏవైనా కావచ్చు .. చూస్తూ చూస్తూ ఇంకా ఎన్ని ప్రాణాలు బలవ్వాలి ? అలా కాకూడదు వాళ్ళ కోసం ఏదో ఒక పథకం ఆలోచించాలనే తపన నుండి వచ్చిందే ‘ సూట్స్ ’ బతికే అవకాశం ఉన్న ఏ ప్రాణం పోకూడదనే సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చిందే ఈ సంస్థ. ఈ సంస్థకు వ్యవస్థాపకుడు సోమ శేఖర్ రెడ్డి అనే యువ ప్రతిభావంతుడు. ఆయనను ప్రతిభావంతుడు అనేకన్నా మనసున్న

మారాజు అంటే బాగుంటుందేమో. మన ప్రతిభ ఎదుటివాడి ఆపదను గట్టెక్కిస్తే అంతకన్నా మన ప్రతిభకు విలువేముంటుంది కదా ? ఈ ఐడియా గురించి, దాని ప్రాసెస్ గురించి చూద్దాం.ట్రామాకేర్ సేవల కోసం ముఖ్యంగా ఈ పాలసీ ప్రారంభించారు. రూ.799 లు చెల్లించి సభ్యత్వం పొందాక రెండు లక్షల రూపాయాల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. దీనికి షరతులు ఏమీ వర్తించవు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారు ఎవరైనా మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. సూట్స్‌లో సభ్యత్వం పొందాక మీకు ఎలాంటి ప్రమాదం జరిగిన మీ వద్ద ఉన్న కార్డుపై ఉన్న నంబర్‌కి కాల్ చేస్తే కాల్ సెంటర్ ద్వారా కేర్ టీం సభ్యులకు సమాచారం అందుతుంది. సూట్స్ కేర్ టీం సభ్యుడు మీరున్న దవాఖానకు వచ్చి దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటాడు. మీకు అవసరమయ్యే వైద్యాన్ని డాక్టర్లతో సంప్రదించి సరైన సమయంలో అందేలా చేస్తాడు.

200 మంది వైద్యులు సూట్స్ తరపున ప్రస్తుతానికి సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 5,500 ఆసుపత్రులతో సూట్స్ ఒప్పందం కుదుర్చుకొని సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నది. లాభం లేకుండా ఏ వ్యాపారం నడువదు. బతికే అవకాశం ఉన్న ఏ ప్రాణం పోకూడదనే ముఖ్య ఉద్దేశంతో సోమశేఖర్ దీన్ని మొదలుపెట్టాడు. అమెరికాలో షిప్ కార్నివాల్ క్రూయిజ్‌లైన్స్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ ఆరు నెలలు ఉద్యోగం చేస్తూ ఆరు నెలలు సూట్స్ బాధ్యతల్ని భుజాన వేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సంస్థకు ఎలాంటి లాభం రాకపోయినా నిరుపేదలకు వైద్యం అందించాలని తపిస్తున్నాడు. హైదరాబాద్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో సూట్స్ సేవలందిస్తున్నది. భవిష్యత్తుల్లో దేశవ్యాప్తంగా విస్తరించి మరింతమంది ప్రాణాలకు కాపాడాలనుకుంటున్నారు.

సంఘజీవులనుకుంటూనే ఎవరికి వారు బతుకుతున్న స్వార్థ సమాజం నీడలో వున్నాం. మనకు మనం సంపాదించుకొని కూడబెట్టుకున్నదే మనకు రక్షగా నిలబడుతుంది. ఇక్కడ మ్యాటర్ సంపాదన గురించి కాదు. వేలు, లక్షలు, కోట్ల గురించి అసలే కాదు. అసలే లేనివారి పరిస్థితికి ఆన్సర్ సూట్స్ మత్రమే చెబుతుంది. రూ.799 రూపాయలు చెల్లిస్తే రెండు లక్షల రూపాయల వైద్యం అందించే ఒక ఇన్సురెన్స్ పాలసీని మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు సోమశేఖర్. యాక్సిడెంట్ అయినా ఇంకే ప్రమాదమైనా 12నెలల వ్యాలిడిటీతో ఉచిత వైద్యాన్ని దీనితో పొందొచ్చు. హైదరాబాద్‌లో 30 పెద్ద ఆసుపత్రులతో దీనికి సంబంధించి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 1500 ఆసుపత్రుల్లో వీళ్ల సర్వీస్ అందుబాటులో ఉన్నది. అంతేకాదు.. సంవత్సరకాలంలో మీరు చందాదారులుగా ఉండి ఎలాంటి ప్రమాదాలకు గురవకుంటే.. ఆ డబ్బుతో వేరే వాళ్లకి వైద్యం అందించే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల మీ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు.. చారిటీ రూపంలో మరొకరి ప్రాణాన్ని రక్షించే వాళ్లుగా నిలిచిపోవచ్చు. ఇప్పటి వరకు ఈ పాలసీ ద్వారా మూడువేల మందికి అత్యవసరంగా చికిత్స అందించగలిగారు. ఇప్పటికే పలు సంస్థలు, కాలేజీలు సభ్యత్వాలు తీసుకోవడానికి పోటీపడుతున్నాయి. కానీ సాధారణ ప్రజలకు మాత్రం చేరువ కాలేకపోయింది.

దేశ వ్యాప్తంగా ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. కొందరు డబ్బుండి వైద్యం చేయించుకోగలుగుతున్నారు. ఇంకొందరు అవగాహన ఉండి పాలసీలు, ఇన్సూరెన్స్‌లు చెల్లుబాటు చేసుకుంటున్నారు. భీమా సౌకర్యాల గురించి తెలిసిన వాళ్లు ముందే సభ్యత్వం తీసుకొని వాటిని సద్వినియోగపరుచుకుంటున్నారు. ధరలెక్కువని కొందరు భయపడి దూరంగా ఉంటే.. వాటి గురించి తెలియక వాడుకోలేకపోతున్నారు. సాధనా యూనిక్ ఇన్నోవేటివ్ సర్వీసెస్ సామాన్యులకు కూడా ఇన్సూరెన్స్‌లు అందాలని, ఖరీదైన వైద్యంతో పాటు బీమా సదుపాయం వర్తించేలా చేసేందుకు ముందుకొచ్చింది.

డాక్టర్ సోమశేఖర్

ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువయ్యాయి. ఎంతో మంది ఉజ్వల భవిష్యత్తున్న యువకులు చనిపోతున్నారు. ఇతరాత్రా రోగాలూ, వ్యాధుల బారినపడి కూడా చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. కొందరి దగ్గర వైద్యానికి డబ్బుల్లేక ఊపిరిని ఆపుకుంటున్నారు. ఇలాంటి విషాధాలను దగ్గరగా గమనించిన డాక్టర్ సోమశేఖర్ తల్లడిల్లాడు. తన వంతుగా పేద ప్రజల కోసం ఏమైనా చెయ్యాలనుకున్నాడు. ఎలాగైనా తను పెద్దయ్యాక డాక్టరవ్వాలనుకున్నాడు.నిరుపేదలకు ఖరీదైన వైద్యం అందేలా ఏదైనా సరికొత్త ఆలోచన చేయాలనుకున్నాడు. అలా పుట్టుకొచ్చిందే ఈ ఆరోగ్య బీమా పథకం. దీంతో అందరికీ పేదలకు ధీమా కల్పించొచ్చు అనుకున్నాడు. అప్పులు చేసి డాక్టర్ చదివిన తాను అప్పులు తెచ్చే రోగులకు వైద్యం చేయాలనుకోలేదు. డాక్టర్ అయ్యాక లక్ష్యం చేరుకున్నా కదా అని ఆగిపోలేదు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే సంకల్పంతో సాధనా యూనిక్ ఇన్నోవేటివ్ సర్వీసెస్‌ను మిత్రులతో కలిసి ప్రారంభించాడు.

పూర్తి వివరాల కోసం ఈ లింకుకు కనెక్ట్ అయితే సరి..  suitseveryone.com