సుకన్య సమృద్ధి యోజన పేరుతో ఆడపిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న చిన్న పొదుపు పథకం. ఈ పథకానికి ఇప్పటికీ ఆదారణ లభిస్తోంది. ఆడపిల్లల చదువు నుంచి పెళ్లి వరకు తల్లిదండ్రులకు ఆందోళనను దూరం చేసే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడిదారుల ఫేవరెట్ లిస్టులో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు దాదాపు 3కోట్ల ఖాతాలు తెరవగా…గత రెండు రెండు రోజుల్లోనే పది లక్షలకు పైగా ఖాతాలు తెరిచారంటే దీన్ని బట్టి ఈ స్కీమ్ కు ఎంత ఆదరణ ఉందో అంచనా వేయవచ్చు.
స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం, అమృత్ కాల ప్రారంభం సందర్బంగా పొదుపు పథకాలకు సంబంధించి 2023ఫిబ్రవరి 1నుంచి ఫిబ్రవరి 8 వరకు పోస్టాఫీసు ప్రారంభించిన ప్రత్యేక అవగాహన ప్రచారానికి ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. రెండు రోజుల్లోనే పది లక్షలకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచారు. ఈ ఘనతసాధించినందుకు పోస్టల్ శాఖను ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ ద్వారా అభినందించారు. ప్రధాని మోదీ చేసిన ఈ ట్వీట్ ఈ గొప్ప విజయానికి @indiapostofficeకి అభినందనలు. ఈ ప్రయత్నం దేశ ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కలిపిస్తుంది. వారిని శక్తివంతంగా మారుస్తుందంటూ ట్వీట్ చేశారు.
2015 నుంచి ఇప్పటి వరకు 2.73కోట్ల ఖాతాలు
ఆడకూతుళ్ల భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 2.73కోట్ల ఖాతాలను తెరిచినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రతిఏటా దాదాపు 33 లక్షల ఖాతాలు తెరిచారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి దేశప్రజల అభిమాన జాబితాలో చోటు దక్కించుకుంది
కూతురు చదువు నుంచి పెళ్లి వరకు నో టెన్షన్
ఈస్కీములో రోజుకు రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే మీ కుమార్తె పెళ్లి వరకు రూ. 15లక్షల మొత్తాన్ని పొందవచ్చు. ఒక ఏడాదికి ప్రతి నెల రూ. 3000పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే… మెచ్యూరిటీ తర్వాత ఈ మొత్తం రూ. 15లక్షల మించి ఉంటుంది. దరఖాస్తుదారులు ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీసులో తమ కుమార్తె పేరు మీద ఖాతాను తెరవవచ్చు.ఈ పథకంలో ఏటా గరిష్టంగా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. అయినప్పటికీ, దాని మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు, కానీ కూతురుకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహానికి కానీ ఉన్నత చదువుల కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ పథకంలో ఇద్దరు కుమార్తెల ఖాతాపై 80సీ కింద పన్ను మినహాయింపు ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒక కుమార్తె తర్వాత ఇద్దరు కవల కుమార్తెలు ఉంటే, వారిద్దరికీ కూడా ఖాతా తెరవాలనే నిబంధన ఉంది. పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది.