sukesh Chandrasekhar in Tihar Jail
mictv telugu

భార్యతో ఒక్క రాత్రి గడపడానికి రూ. 75 లక్షల లంచం

July 10, 2022

మనీ లాండరింగ్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న సుకేష్ చంద్రశేఖర్ లీలలు ఒక్కోటి బయటపడుతున్నాయి. జైల్లో 81 మంది అధికారులకు భారీగా లంచాలిచ్చినట్టు ఢిల్లీ పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం విచారణలో తేల్చింది. జైలులో తన భార్య లీనాతో గడపడానికి ఒక్కరోజుకే చంద్రశేఖర్ రూ. 60 నుంచి రూ. 75 లక్షల వరకు లంచం ఇచ్చేవాడంట. తర్వాత అతడిని తీహార్ జైలుకు మార్చగా జైల్లో ఉంటూనే వ్యవహారాలు చక్కబెట్టిన వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. దీంతో తాను లంచం ఇచ్చిన అధికారుల నుంచి ప్రాణహాని ఉందని, తనను ఢిల్లీ బయట ఉండే జైలుకు మార్చాలని చంద్రశేఖర్ పిటిషన్ వేశాడు. ఇది ప్రస్తుతం విచారణలో ఉంది. కాగా, బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేలకు భారీ స్థాయిలో బహుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయా హీరోయిన్లు కూడా ఈడీ విచారణలో ఒప్పుకున్నారు. ఐఫోన్లతో పాటు ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లను తీసుకున్నట్టు వారు తెలిపారు. జాక్వెలిన్ అయితే 1.5 లక్షల డాలర్లను రుణంగా తీసుకున్నానని వెల్లడించింది..