Sukesh Chandrashekhar : Luxury items in raid on alleged conman Sukesh Chandrashekhar's cell
mictv telugu

Sukesh Chandrashekhar : జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న సుఖేశ్‌ చంద్రశేఖర్‌!!!

February 23, 2023

 

Sukesh Chandrashekhar : Luxury items in raid on alleged conman Sukesh Chandrashekhar's cell

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన నిందితుడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌.. జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలిసింది. సుఖేశ్‌ ఉంటున్న జైలు గదిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జైలు అధికారులు ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో లక్షన్నర రూపాయలు విలువైన గూచీ చెప్పులు, 80 వేల రూపాయలు విలువైన 2 జీన్స్‌ ప్యాంటులు ఉన్నాయి. సుఖేశ్‌ సెల్లో సోదాలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మనీ లాండరింగ్ కేసులో బెయిల్‌పై విడుదలైన సుఖేశ్‌ను వారంక్రితం మరో కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసి, ఢిల్లీ మండోలీ జైలుకు తరలించింది. ఈ నేపథ్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి జైలు అధికారులు సుఖేశ్‌ సెల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జైల్లోనూ అతను రాజభోగాలు అనుభవిస్తున్నట్లు గుర్తించారు. తనిఖీల సమయంలో జైలు గదిలోని ఓ మూలన నిలబడిన సుఖేశ్‌.. జైలర్ దీపక్ శర్మ ముందు ఏడ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి మరో జైలు అధికారి.. సుఖేశ్‌ గదిలోని అణువణువూ గాలించారు. రేలిగేర్ ప్రమోటర్ మల్విందర్ సింగ్‌కు బెయిల్‌ ఇప్పించేందుకు మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నాడని.. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో గత వారం సుఖేశ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అరెస్ట్ చేసింది.