15 వేలమంది బొడ్డుతాడు బామ్మ ఇక లేదు

వైద్యంలో చేంతాళ్లంత డిగ్రీలు లేకపోయినా వేలమంది గర్భిణులకు అకింతభావంతో ఉచితంగా పురుడు పోసి, కనిపించే దేవతగా ప్రశంసలు అందుకున్న బామ్మ ఇక లేదు. తన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న కర్ణాటక బామ్మ సూలగిత్తి నరసమ్మ బెంగళూరులో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 99 ఏళ్లు.

r4

తుమకూరు జిల్లా పావగడ తాలుకాలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన నరసమ్మ  ఏడు దశాబ్దాలుగా పురుళ్లు పోస్తున్నారు. ఇప్పటి వరకు 15 వేల మంది గర్భిణులకు ఆమె పురుడు పోశారు. ఈ తల్లుల్లో ఎందరో కవలబిడ్డలకు జన్మనిచ్చారు.

 

rtrt
The President, Shri Ram Nath Kovind presenting the Padma Shri Award to Dr. (Smt.) Sulagitti Narasamma, at the Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on March 20, 2018.

గర్భిణుల ఆరోగ్యం, అలవాట్లు, ఇతర పరిస్థితులను బట్టి నరసమ్మ.. సులువుగా కాన్పులు చేసింది. ఇంటి వద్ద ప్రసవాలు ప్రమాదరకం అని వైద్యులు చెబుతున్నా చాలా మంది మహిళలు కాన్పు కోసమే ఆమెనే నమ్మకంతో ఆశ్రయించేవారు. ఆమె సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది  పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.

454