శరీరంలో అత్యంత బలం కలిగిన అవయవం తొడకండరాలు అనుకుంటాం. కానీ కొందరు చేసే వింత పనులతో కండరాలేంటీ? గోర్లు, వెంట్రుకలు, కనురెప్పలు వంటి చిన్న చిన్న అవయవాలలో కూడా అనంత బలం ఉంటుందని వీడియో సాక్షిగా నిరూపించే సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నిరూపించాయి. అలాంటి కోవలోకి వచ్చే ఈ వీడియో ఏకంగా గిన్నీస్ రికార్డుల్లోకెక్కి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈజిప్టుకు చెందిన ఓ వ్యక్తి కేవలం తన దంతాలతో ఏకంగా 15730 కిలోల ట్రక్కును ఈజీగా లాగేశాడు. ట్రక్కులో ఓ వ్యక్తి కూర్చుని ఉండగా, పక్క వారు అతనికి ప్రోత్సాహం అందిస్తున్న దృశ్యాలను మనం గమనించవచ్చు. అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ అనే వ్యక్తి తన దంతాల బలంతో గిన్నీస్ బుక్కులో స్థానం సంపాదించుకున్నాడు. రెండ్రోజుల క్రితం రిలీజైన ఈ వీడియోకి పాతికవేల లైకులు వచ్చాయి. దీన్ని చూసిన నెటిజన్లు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. ఇతని డెంటిస్ట్ ఎవరో కనుక్కోండి భయ్యా నేనూ అతని దగ్గర నా పళ్లను చూపించుకుంటాను అని, ఆయన దంతాలే ఆయన బలం అని మరొకరు స్పందించారు. ఇంకొకరు మన శరీరంలో అత్యంత బలం కలిగిన అవయవం దంతాలు అని నిరూపించాడని ప్రశంసిస్తున్నారు. మీరూ ఈ వీడియో చూసి మీ స్పందనను కామెంట్ రూపంలో చెప్పండి.