ఒక్క ఫొటోతో నోళ్లు మూయించిన సుమ..  - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క ఫొటోతో నోళ్లు మూయించిన సుమ.. 

September 14, 2020

Suma Rajeev Kanakala Emotional Post

ఓ స్థాయిలో ఉన్నవారి మీద ఎప్పుడూ ఏదో ఒక పుకారు షికారు చేస్తుంటుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అబద్ధాలను యథేచ్ఛగా వ్యాప్తి చెందిస్తున్నారు కొందరు. తాజాగా సీనియర్ యాంకర్ సుమ, రాజీవ్ కనకాల ప్రేమ వివాహంపై పుకార్లు పుట్టించారు. గత కొన్ని రోజులుగా వారి మధ్య ఏవో గొడవలు జరిగాయని.. సుమా రాజీవ్‌లకు మనస్పర్థలు వచ్చాయని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సుమ స్పందించింది. ఎవరికీ ఎలాంటి సంజాయిశీ, వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేనట్టు ఒక్క ఫోటోతో అందరి నోళ్లు మూయించింది. 

తన సోషల్ మీడియా ఖాతాలో భర్త రాజీవ్ కనకాలపై ఉన్న ప్రేమను వ్యక్తంచేస్తూ ఎమోషనల్ కామెంట్స్‌తో పాటు ఒక ఫోటోను పంచుకుంది. ‘రాజా! ఎప్పటికీ నువ్వే నా జీవితం.. నువ్వే నా సర్వస్వం’ అని భావోద్వేగంగా కామెంట్ చేసింది. దీనికి నెటిజన్లు స్పందిస్తున్నారు. మీరిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉంటారని అంటున్నారు. లవ్లీ కపుల్, బ్యూటిఫుల్ కపుల్‌, ఎవర్‌గ్రీన్ జంట అని లవ్ ఎమోజీలు పంచుకుంటున్నారు. ‘అందరినీ నవ్వించే సుమా నువ్వు అస్సలు బాధపడొద్దు’ అని కోరుతున్నారు.