త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. సుమంత్ - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలోనే పెళ్లి చేసుకుంటా.. సుమంత్

December 18, 2017

కెరీర్ తొలినాళ్లలో చక్కని హిట్లు ఇచ్చి తర్వాత వెనకబడ్డాడు సుమంత్. తాజాగా ‘మళ్లీరావా’తో ఫామ్‌లోకి వచ్చాడు. సినిమాలు, వ్యక్తిగత జీవితం, ఆటుపోట్లు వంటివాటిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మనసులో మాటలు చెప్పేశారు. తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు తెలిపారు..

కీర్తిరెడ్డితో ఏడాదే దాంపత్య జీవితం

నటి కీర్తిరెడ్డితో తన దాంపత్యం ఏడాది మాత్రమే గడిచిందని సుమత్ తెలిపాడు.. ‘పెళ్లిపై నాకు గొప్ప అభిప్రాయం ఏమీలేదు. అది కొందరికి వర్కవుట్ అవుతుంది. కొందరికి వర్కవుట్ కాదు.. అంతే.. నాకు కీర్తిరెడ్డికి మధ్య ఉన్న దాంపత్య జీవితం కేవలం ఏడాదే.. అభిప్రాయాలు కలువలేదు.. అందుకే  విడిపోవాలని అనుకున్నాం.. అంతే జరిగింది.

మా మధ్య ఎలాంటి గొడవలూలేవు.. మావయ్య నాగార్జున వల్లే మేం విడిపోయాం అని చెప్పడం తప్పు.. ఆయనకు సంబంధమే లేదు. నేనూ, కీర్తీ.. ఇప్పటికీ మంచి స్నేహితులం. వాళ్ల ఫ్యామిలీ నన్ను ఎంతగానో గౌరవిస్తుంది.  కీర్తిరెడ్డి ప్రస్తుతం బెంగళూరులో ఉంది. ఇద్దరు  పిల్లలు ఆమె.. వారిది హ్యాపీ కుటుంబం. మేం  ఫోన్‌లో మాట్లాడుకుంటాం. మా తాతా  చనిపోయినప్పుడు కీర్తి వచ్చి కలిసింది.. ’ అని సుమంత్ చెప్పాడు.