సమ్మర్ ఎఫెక్ట్.. దేవుడికి కూలర్, నూలు వస్త్రాలు - MicTv.in - Telugu News
mictv telugu

సమ్మర్ ఎఫెక్ట్.. దేవుడికి కూలర్, నూలు వస్త్రాలు

May 10, 2019

దేశవ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మండుతున్న ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎండ వేడిమికి ప్రజలు మాత్రమే కాదు దేవుళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ మహారాష్ట్రలోని కాన్పూర్‌లో పలు దేవాలయాల్లో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నగరంలోని సిద్ధి వినాయక దేవాలయం పూజారి సుర్జీత్ కుమార్ దూబే మాట్లాడుతూ, దేవుళ్లు కూడా ఉక్కపోతకు గురవుతారని చెప్పారు. వాళ్లు కూడా మనుషులాంటి వారే అని అన్నారు. అందుకే స్వామివారిని చల్లగా ఉంచేందుకు కూలర్ ఏర్పాటు చేశామని చెప్పారు. వేడిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు పలుచటి వస్త్రాలను ధరింపజేశామని తెలిపారు.