స్లిమ్ అవ్వాలంటే ..సమ్మరే బెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

స్లిమ్ అవ్వాలంటే ..సమ్మరే బెటర్

May 15, 2017

 

బరువు భారమైతే బాడీ చెప్పిన మాట వినదు.ఎప్పుడూ దానేపైనే బెంగ. పెరిగిన శరీరాన్ని తగ్గించుకోవడానికి ఫిట్‌నెస్‌ కేంద్రాల్లో ఫీట్లు చేయాల్సిందే. ఇలా ఎన్నో కుస్తీలు కాదు సమ్మర్‌ చిట్కాలతో ఫ్యాట్ ని తగ్గించుకోవచ్చు.

చల్లనీళ్లతో స్నానం తర్వాత వ్యాయామం
తక్కువ బరువు ఉండి, చెమటను త్వరగా పీల్చే దుస్తులతో వ్యాయామం చేయడం మంచిది. వేసవిలో వర్క్‌ అవుట్స్‌, కష్టతరమైన యోగాసనాలు, సూర్య నమస్కా రాలు తక్కువ చేయడం ఉత్తమం. బరువు తగ్గాలనుకున్న వారికి స్విమ్మింగ్‌ మంచి వ్యాయామం. ఈత రాని వారికోసం ఆక్వా జుంబా, ఆక్వా యోగ అందుబాటులోకి వచ్చాయి. వర్క్‌అవుట్స్‌ చేయడానికి ముందే చన్నీటి స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగదు. వాకింగ్‌, జాగింగ్‌ వంటివి మినహాయిస్తే, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సూచనలతో వర్క్‌అవుట్లు చేయడం మంచిది.

ఆహారంతోపాటు శీతలి ప్రాణాయామం
వేసవిలో భానుడి ప్రతాపం ఉదయం ఏడు గంటల నుంచే మొదలవుతుంది. కత్తెర్లు మొదలైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఎండల తీవ్రతను తట్టుకోవాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువ తాగాలి. వీటితోపాటు శీతలి ప్రాణాయామం చేస్తే కొంత వరకు ఎండల ప్రతాపాన్ని తట్టుకునే శక్తి శరీరానికి అందుతుంది. బరువు తగ్గడానికీ ఉపయోగపడుతుంది. నాలుకను మడిచి, నోటి ద్వారా గాలి పీల్చి, ముక్కు ద్వారా వదిలే ప్రక్రియే శీతలి ప్రాణాయామం. ఉదయం ఏడు గంటలలోపు ఐదు నిమిషాలపాటు ఈ వ్యాయామం చేయడం మంచిదని యోగాసనాల్లో ప్రావీణ్యం ఉన్న వారు సూచిస్తున్నారు.

మట్టి కుండ నీళ్లతో గొంతు తడుపుకుంటే…
మామూలు రోజుల కంటే, వేసవిలో మనిషి ఆకలిలో ఎక్కువ వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఎంతటి భోజన ప్రియులైనా వేసవి కాలంలో కాస్త మోతాదు తగ్గించి ఆహారం తీసుకుంటారు. వేసవిలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది. దాహం ఎక్కువ, ఆకలి తక్కువగా ఉంటుంది. 15 నుంచి 20 నిమిషాలకు ఒకసారి చొప్పున రోజుకు కనీసం ఏడు లీటర్లు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రిజ్‌లో నీటికన్నా కుండలోని నీటిని తాగడం ఉత్తమం.

చిరాకును వదలండిలా…
వేసవిలో ప్రతి మనిషిలోనూ చిరాకు ఎక్కువగా కనిపిస్తుంది. చెమటకు, ఉక్కబోతకు చిన్న విషయానికే చిర్రుబుర్రులాడుతుంటారు. ఒక్కోసారి ఆ ప్రభావం ఎదుటి వారిపై చూపిస్తుంటారు. దీన్ని దూరం చేసుకోవడానికి చంద్రభేదన యోగాసనం ఉత్తమ మార్గమని యోగా నిపుణులు చెబుతున్నారు. కుడినాసికా రంధ్రాన్ని పూర్తిగా మూసేసి, ఎడమ నాసికా రంధ్రాన్ని సగం మూసి గాలి పీల్చి, రెండు నాసికా రంధ్రాల నుంచి వదలాలి.

ఈ ఆహారం తీసుకుంటే
నీటి శాతం ఎక్కువగా ఉంటే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చ, కీర, కర్బూజ, తాటిముంజలు, బీర, పొట్ల వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు, లవణాలు అందుతాయి.
నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల కడుపు నిండినట్టుంటుంది. డైట్‌ కంట్రోల్‌ అవుతుంది.

శీతల పానియాలు, చక్కర వేసిన జ్యూస్‌లు, మ్యాంగో, సపోటా వంటివి తీసుకుంటే మాత్రం బరువుతగ్గకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఆకలి తక్కువ.. దాహమెక్కువ. వేసవిలో ఆకలి తక్కువగాను, దాహం ఎక్కువగాను ఉంటుంది. జీర్ణక్రియలోనూ తేడాలు వస్తుంటాయి. డైట్‌ పాటిస్తూ కాలానికి తగ్గట్టుగా ఆహారపదార్థాలను తీసుకోవడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. బరువు తగ్గించుకోవాలనుకునే వారికి వేసవి… ప్రకృతి ఇచ్చిన అవకాశం.

HACK:

  • Summer is the best to slim your body by doing fitness exercises and by taking healthy food.
  • Swimming is the best exercise to lose weight.