sun image on the main Rajagopuram of the world famous Sree Padmanabhaswamy temple
mictv telugu

అనంత పద్మనాభస్వామి ఆలయంలో అపురూప దృశ్యాలు

September 24, 2022

ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఆలయం.. అనంత పద్మనాభస్వామి దేవాలయం. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం.. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటి. ఈ గుడిలో పాలసముద్రంలోని శేషపాన్పుపై పవళిస్తున్నట్లుగా శ్రీహరి రూపముంటుంది. పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశమైంది.

కాగా శుక్రవారం సాయంత్రం ఈ ఆలయ ప్రధాన రాజగోపురంపై సూర్యబింబం చేసిన విన్యాసాలు అబ్బురపరచాయి. అస్తమయం అవుతున్న సూర్యుడు కొన్ని నిమిషాల తేడాలో రాజగోపురానికి చెందిన అయిదు అంతస్తుల గవాక్షాల(ద్వారాల) నుంచి తన కిరణాలను ప్రసరిస్తూ కనువిందు చేశాడు. ఈ అపురూప దృశ్యాన్ని స్థానికులు, భక్తులు తన్మయత్వంతో వీక్షించారు.