Sun Pictures releases first look of Rajinikanth’s 169th film ‘Jailer’
mictv telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

August 22, 2022

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రతీ ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తమిళ్ తలైవా నటించిన సినిమాలను జనాలు చూస్తుంటారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఫిల్మ్ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ చేస్తున్న 169వ సినిమా ఇది. ‘జైలర్’ సినిమా ఈ రోజునే సెట్స్ పైకి వెళ్లింది. నెల్సన్ దిలీప్ తయారు చేసుకునే కథలు .. ఆయన స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉంటాయి.

‘జైలర్’ టైటిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రజనీ పోస్టర్ ను వదిలారు. డిఫరెంట్ లుక్ తో చాలా సీరియస్ గా రజనీ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. నెల్సన్ దిలీప్ ఇటీవలే విజయ్‌తో ‘బీస్ట్’ సినిమా చేశాడు. ‘బీస్ట్’ లో కథ అంతా కూడా షాపింగ్ మాల్ చుట్టూ తిరిగితే, ఈ సినిమాలో కథ అంతా కూడా ‘జైలు’ చుట్టూ తిరుగుతుందట. ఈ ఫిల్మ్ ..డెఫినెట్ గా అభిమానుల అంచనాలను అందుకుంటుందని మేకర్స్ చెప్తున్నారు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు రజినీకాంత్‌ లుక్‌ ను కూడా విడుదల చేసింది. ఇందులో రజినీ చాలా క్లాసిక్‌ లుక్‌ లో కనిపించారు.