భక్తులు ఖుషీ.. అసరవల్లి దేవాలయంలో అద్భుతం.. - MicTv.in - Telugu News
mictv telugu

భక్తులు ఖుషీ.. అసరవల్లి దేవాలయంలో అద్భుతం..

October 1, 2018

ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనాయరణ స్వామి దేవాలయంలో ఈ రోజు ఉదయం అద్భుతం జరిగింది. స్వామివారి  ముఖాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఆదిత్యుని పాదాలను సూర్యకిరణాలు తాకాల్సిన సమయంలో మేఘాలు అడ్డు వచ్చాయి. దీంతో భక్తులు తీవ్ర నిరాశ చెందారు. ఆపై క్షణాల్లోనే స్వామివారి ముఖాన్ని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు భక్తిపారవశ్యంతో పరవశించిపోయారు.Sun Rays Touch Surya Bhagvan Feet In Suryanarayana Temple in  Arasavalliప్రతి ఏడాది ఉత్తరాయణం నుంచి దక్షిణాయానికి మారే సందర్బంలో సూర్యకిరణాలు, సూర్యభగవానుడిని తాకుతాయి. ఈ  ఆద్బుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. సూర్యకిరణాలు స్వామి పాదాలను తాకి ఆపై ముఖానికి తాకుతాయి. ఈ అద్భుత ఘట్టం మార్చి  9, 10 తేదీల్లో, అలాగే అక్టోబరు 1, 2 తేదీల్లో కనువిందు చేస్తుంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే కనిపించే ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు.