సూర్యుడి రహస్యాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు..! - MicTv.in - Telugu News
mictv telugu

సూర్యుడి రహస్యాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు..!

August 3, 2017

సూర్యుడిని మనం చూడడానికి కూడా వీలు కాదు. అలాంటిది శాస్త్రవేత్తలు సూర్యునికి సంబందించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు.
తాజాగా సూర్యుని గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఓ రహస్యాన్ని తెలిపారు. సూర్యుని ఉపరితలం కంటే దాని మధ్యలో ఉన్న అంతర్ భాగం నాలుగు రెట్లు వేగంగా భ్రమిస్తుందని సౌర శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలిసారి సోలార్ కోర్ భ్రమణాన్ని శాస్ర్తవేత్తలు సరిగ్గా అంచనా వేశారు.

యూరోపియన్ స్పేస్, నాసాకు చెందిన సోలార్ అబ్జర్వేటరీ ఈ విషయాన్ని వెల్లండిచాయి. సూర్యుడిలో ఉన్న సెసిమిక్ వేవ్ ల వల్ల మధ్య భాగం భ్రమిస్తున్నట్టు అంచనా వేశారు. జీ మోడ్స్ అనే ఫ్రీక్వెన్సీ తరంగాల పై పరిశోధనల ద్వారా 4.6 బిలియన్ల ఏళ్ల క్రింతం సూర్యుడు ఏర్పడ్డాడని అప్పటీ నుంచి కోర్ రొటేషన్ జరుగుంతుందని కాలిఫోర్నియాకు యూనివర్సిటీ ప్రొఫెసర్ రోజర్ ఉల్రిచ్ తెలిపారు. సూర్యుని ఉపరితలం ఎంత వేగంగా తిరుగుతుందో అంతే వేగంగా మధ్యభాగం కూడా తిరుగుతుందని అనుకున్నారు. కాని ఇప్పుడు తప్పు అని తెలిందట