గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన కాలేజీ జీవితంలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో చుట్టూ హిందీ మాట్లాడేవాళ్లే ఎక్కువగా ఉండేవారు. ఒకరినొకరు స్నేహంగా పలకరించుకున్నప్పుడు వారందరూ ‘అబే సాలే’ అని సంబోధించేవారు. ఒకసారి నాకు ఓ హిందీ క్లాస్మేటుని పిలిచే సందర్భం వచ్చినప్పుడు నేను కూడా అబే సాలే అని పిలిచాను. అతను నావంక కోపంగా చూశాడు. ఎందుకలా చూశాడో తర్వాత అర్ధమైంది. అప్పటివరకూ నేను అబే సాలే అంటే కామన్‌గా ఉండే పేరేమో అనుకున్నాను’ అని చెప్పగానే సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు.