మామ ప్లేసులో సమంత హోస్టింగ్.. రేపటి బిగ్‌బాస్ అదిరింది - MicTv.in - Telugu News
mictv telugu

మామ ప్లేసులో సమంత హోస్టింగ్.. రేపటి బిగ్‌బాస్ అదిరింది

October 24, 2020

బిగ్‌బాస్ సీజన్ 4 హోస్టుగా సమంతా అక్కినేని రాబోతోంది. రేపటి ఆదివారం ఎపిసోడ్‌కు సమంత మామ నాగార్జున అక్కినేని ప్లేసులో ప్రేక్షకులను అలరించనుంది. ఇందుకు సంబంధించిన క్లిపింగ్ ఇవాల్టి ఎపిసోడ్‌లో ప్రసారం చేశారు. సమంత రాగానే ఇంట్లో సభ్యులు అందరూ లేచి నిలబడి ఆమెకు సాదరంగా స్వాగతం చెప్పారు. సమంత స్టేజ్ మీదకు రాగానే నాగార్జున వీడియో కాల్‌లో మాట్లాడటం, మామయ్య స్థానంలోకి తాను వచ్చానని చెప్పడాన్ని చూపించారు. నాగార్జున ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున లేకపోవడంతో కాస్త కళ తప్పినట్టే అయింది. ఇంటి సభ్యులు అందరికీ సినిమా షూటింగ్ టాస్క్ ఇచ్చారు. ‘ప్రేమ మొదలాయె’ కాన్సెప్టులో అవినాష్-అరియానా, అఖిల్-మోనాల్ జంటలుగా నటించారు. కాగా, రేపటి ఎపిసోడ్ కోసం బిగ్‌బాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా సమంతా రేపటి ఎపిసోడ్‌కు ప్రత్యేకం అనే చెప్పాలి. కాగా, గతంలో బిగ్‌బాస్ సీజన్ 3లో కూడా నాగార్జున ఇలాగే షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఆయన స్థానంలో రమ్యకృష్ణ వచ్చి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.