సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ.. 'మైఖేల్' ఫస్ట్‌లుక్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ.. ‘మైఖేల్’ ఫస్ట్‌లుక్ విడుదల

May 7, 2022

ప్రస్థానంతో తన సినీ ప్రస్థానాన్ని మొదలెట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్‌ కిషన్‌ బర్త్ డే నేడు. తొలి చిత్రంలోనే నెగిటివ్‌ రోల్‌తో మెప్పించి.. ఆ తర్వాత వైవిధ్యమైన కథలని ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో తనదైన మార్క్ చాటుతున్న ఈ యంగ్ హీరో ఇటీవలె ఓ పాన్ ఇండియా సినిమా ‘మైఖేల్‌’ లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.

 

మైఖేల్‌ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌తో పాటు విజయ్‌ సేతుపతి కూడా నటుస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ‘మైఖేల్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. విజయ్‌ సేతుపతి స్వయంగా ట్విట్టర్‌ వేదికగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశాడు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు.. సందీప్‌ కిషన్‌కు బర్త్‌డే విషెస్‌ కూడా తెలిపారు. రంజిత్ జయ కోడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సందీప్‌ సరసన దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.