నువ్వు అప్పుడింకా పుట్టలేదు.. కొహ్లీకి గవాస్కర్ కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వు అప్పుడింకా పుట్టలేదు.. కొహ్లీకి గవాస్కర్ కౌంటర్

November 25, 2019

పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అతని మాటలకు మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ వ్యంగ్యంగా స్పందించారు. విదేశీ గడ్డపై భారత జట్టు విజయాల పరంపర 1970 – 80 మధ్యకాలంలోనే మొదలైందని గుర్తు చేశారు. అప్పటికీ ఇంకా కొహ్లీ పుట్టలేదని, గతం తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఆయన వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో ఆసక్తిక చర్చ మొదలైంది. 

Sunil Gavaskar.

ఇటీవలి కాలంలో టీం ఇండియా విదేశీ గట్టపై వరుస విజయాలకు సౌరవ్ గంగూలీ సారథ్యం నుంచే మొదలైందని విరాట్ కొహ్లీ వ్యాఖ్యానించాడు. దీనిపై గావస్కర్‌ అసహనం వ్యక్తం చేశాడు. సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉన్నాడు కాబట్టే కోహ్లి అలా పొగిడాడని అన్నారు. అంతకు ముందే ఈ ఘనత టీం ఇండియాకు ఉందని గుర్తు  చేశారు. 1986లోనే భారత జట్టు విదేశాల్లో విజయం సాధించిందన్నారు. చాలా విదేశీ టెస్టులను భారత్‌ డ్రా కూడా చేసుకుందని చెప్పారు. పరాజయాలు కూడా అలాగే ఉన్నా ఒక్క గంగూలీకే క్రెడిట్ ఇవ్వడం సరికాదన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న టీం ఇండియా ఆటగాళ్ల తీరు మాత్రం మెచ్చుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.