Sunitha Boya once again stood naked in front of Geetha Arts office
mictv telugu

గీతా ఆర్ట్స్ ముందు మళ్లీ నగ్నంగా.. అతడే ఆమె టార్గెట్

November 18, 2022

Sunitha Boya once again stood naked in front of Geetha Arts office

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదురుగా.. నడిరోడ్డుపై ఓ మహిళ నగ్నంగా బైఠాయించింది. ఈ ఘటన టాలీవుడ్‌లో సంచలనానికి దారి తీసింది. సినీ నిర్మాత బన్నీ వాసు కారణంగా మోసపోయానని సునీత బోయ అనే మహిళ మరోసారి గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. ఆమె చాలా కాలంగా ఈ ఆరోపణ చేస్తోంది. గతంలో కూడా ఆమె ఇలాగే చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగా లేనందున పోలీసులు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తాజాగా గురువారం రాత్రి సైతం నగ్నంగా ఆందోళకు దిగడంతో జూబ్లీహిల్స్‌ మహిళా పోలీసులు అక్కడికి చేరుకొన్నారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దుస్తులు వేసి సర్దిచెప్పారు. తనకు నెలవారీ ఖర్చులకు ఇబ్బందిగా ఉందని ఆమె పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. బన్నీ వాసు బృందం ఇతర ప్రాంతంలో ఉందని, వచ్చాక మాట్లాడతామని చెప్పిన పోలీసులు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. గతంలో నటి శ్రీరెడ్డి కూడా ఇదే తరహాలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద శ్రీరెడ్డి కూడా అర్థనగ్నంగా బైఠాయించి, తన నిరసన తెలిపారు.

https://twitter.com/sairaaj44/status/1593275796218863618