మీకు ఏ షాట్ నచ్చింది? - సన్నీలియోన్ క్యూట్ క్వశ్చన్ - MicTv.in - Telugu News
mictv telugu

మీకు ఏ షాట్ నచ్చింది? – సన్నీలియోన్ క్యూట్ క్వశ్చన్

March 24, 2022

sunny

పోర్న్ స్టార్‌గా కెరీర్ ప్రారంభించి బిగ్‌బాస్ ద్వారా ఇండియాలో బాగా ఫేమస్ అయిన సన్నీలియోన్ ప్రస్తుతం హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఆమె భర్తతో పాటు మాల్దీవుల్లో రెండ్రోజుల పాటు షికారు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా రెడ్ డ్రెస్‌లో ఉన్న ఓ వీడియోను ట్విట్టర్‌లో రిలీజ్ చేసింది. అందులో ఏ షాట్ (ఫోజు) మీకు నచ్చిందో చెప్పాలంటూ క్యూట్‌గా క్యాప్షన్ పెట్టింది. అంతేకాక, ముందు మీరు చెప్పండి. నాకు నచ్చింది తర్వాత చెప్తానంటూ ఆసక్తి రేకెత్తించింది. దీంతో అభిమానులు తమకు నచ్చిన ఫోజులను రకరకాల యాంగిల్స్‌లో కామెంట్ చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పలు హిందీ, తెలుగు సినిమాల్లో నటించిన సన్నీలియోన్ అసలు పేరు కరణ్‌జిత్ కౌర్ వోహ్రా. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా వస్తున్న గాలి నాగేశ్వర్రావు చిత్రంలో రేణుక అనే పాత్రలో నటిస్తోంది.