కామసూత్రలో నటిస్తున్న సన్నీలియోనీ! - MicTv.in - Telugu News
mictv telugu

కామసూత్రలో నటిస్తున్న సన్నీలియోనీ!

September 25, 2019

Sunny Leone

పోర్న్ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌కు వచ్చిన సన్నీలియోనికి మళ్లీ అవే అవకాశాలు తలుపు తడుతున్నట్టుగానే వుంది. అప్పుడేదో అలాంటి చిత్రాలు చేశాను.. ఇప్పుడు మాత్రం చక్కగా హిందీ సినిమాలు చేసుకుంటానని ఇదివరకే సన్నీ చాలా సందర్భాలలో చెప్పింది. పోర్న్ జోలికి అస్సలే వెళ్లనని శపథం పూనినంత పనేచేసింది. అయితే తానొకటి తలిస్తే అవకాశాలు మరొకటి తలుస్తున్నాయి. ఆమెను వెతుక్కుంటూ అలాంటి అవకాశాలే వస్తున్నాయి. కాకపోతే పోర్న్ అంతకాకుండా రొమాన్స్ చిత్రాల్లోనే అవకాశాలు వస్తున్నాయి. 

 త్వరలోనే సన్నీ ఏక్తాకపూర్‌ దర్శకత్వంలో రానున్న ‘కామసూత్ర’ వెబ్‌సిరీస్‌లో నటించనుందని తెలుస్తోంది. ఏక్తా కపూర్‌ ‘కామసూత్ర’ ఆధారంగా ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి సన్నీ అయితేనే బాగుంటుందని ఏక్తా భావిస్తోందట. ఈ క్రమంలో సన్నీలియోనీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారట. కథ విన్న సన్నీలియోనీ ఇందులో నటించేందుకు సుముఖంగా ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో ఏక్తాకపూర్‌, సన్నీలియోనీ కలిసి ‘రాగిణి-ఎంఎంఎస్‌2 ‘ చిత్రం కోసం పనిచేశారు. ఇప్పటికే సన్నీ ‘మధుర రాజా’ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె ‘వీరమాదేవి’ ‘స్లిట్స్‌విల్లా సీజన్‌ 12’ చిత్రాల్లో నటిస్తోంది.