సన్నీలియోన్ సెకండ్ ఇన్నింగ్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోన్ సెకండ్ ఇన్నింగ్స్..!

September 9, 2017

పోర్న్ తార సన్నిలీయోన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  ఒకప్పుడు పోర్న్ తారగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ సుందరి ఆతర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆటల్లో బీజీ అవుతానంటున్నది. ఇండోర్ స్టేడియంలో ఆడే ఫుట్ బాల్ జట్టు, కేరళ కోబ్రాస్ అనే ఫ్రాంచెసీని కొనుగోలు చేసిందట. ఫుట్ బాల్ రెండో సీజన్ ఈనెలలో ప్రారంభం అవుతుంది.  20వ తేదీ లోపు  తొలి రౌండ్  గేమ్ ముగుస్తుంది.  ఆ తర్వాత బెంగుళూరులో రెండో రౌండ్ ఆట  జరుగుతుందట. ఫైనల్ మ్యాచ్ లు దుబాయ్ లో నిర్వహిస్తారట.

కొద్ది రోజుల కింద  కొచ్చిలో ఏదో కార్యక్రమానికి వెళ్లిన సన్నీని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఇక ఆమెనే ఆట ఆడిస్తున్నదని తెలిస్తే అభిమానులు టీవీలకే అతుక్కుపోవడం ఖాయం  కావొచ్చు. కేరళలో  ఆమెకున్న ఫాలోయింగ్ కారణంగానే, కేరళ టీంను కొనుగోలు చేసిందని కొందరు అనుకుంటున్నారు. మొత్తానికి  క్రీడల్లో కూడా సన్నీ  పాదం మోపిందన్నమాట.