సన్నీ లియోనీ నీ పద్ధతేం బాగాలేదు.. ఫోర్జరీపై విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీ లియోనీ నీ పద్ధతేం బాగాలేదు.. ఫోర్జరీపై విమర్శలు

October 29, 2019

ఓ చిత్రాన్ని చూసి దానిని కాపీకొట్టి అది నీదని చెప్పుకుంటే నీది అయిపోతుందా సన్నీ? ఏంటితల్లీ నువ్వు చేసిన పని? అంటూ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోనీని సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఓ చారిటీ కోసం ఫ్రెంచ్ చిత్రకారిణి మలికా ఫవ్రే వేసిన చిత్రాన్ని సన్నీ కాపీ కొట్టిందని వారంతా ఆరోపిస్తున్నారు. డైట్‌సబ్య అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు సోమవారం సన్నీ వేసిన చిత్రం, మలికా వేసిన చిత్రాల స్నాప్‌షాట్‌లను పోస్టు చేసింది. ‘మనమందరం సాయం చేయాల్సిందే. ఓ చిత్రకారిణి ఆర్ట్‌ను కాపీ కొట్టి తనదిగా చెప్పుకుని వేలం వేయాలనుకోవడం దారుణం’ అని క్యాప్షన్ పెట్టింది. దీంతో సన్నీలియోన్‌పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Sunny Leone.

‘మాతల్లే.. నీకు నటనే కాదు ఇలాంటి కాపీ బుద్ధి కూడా ఉందా? సరిపోయింది’ అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. తనపై ఇంతలా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే ఆమె ఊరుకుంటుందా? స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని.. అసలు ఆ చిత్రాన్ని తాను కాపీ చేయలేదని, తనకొకరు ఈ ఫొటోను ఇచ్చారని స్పష్టంచేసింది. అది నచ్చడంతోనే తాను దానిని చిత్రించాలని అనుకున్నానని తెలిపింది. దీనిని మీరంతా ఈ లెవల్లో భూతద్దంలో పెట్టి చూస్తారని అనుకోలేదని అంది. కేన్సర్ రోగుల కోసం ఆ పెయింటింగ్‌ వేలం వేస్తున్నందుకు కాంప్లిమెంట్‌గా భావించాలని కోరింది. ఇంతకుమించి చెప్పాల్సిందేమీ లేదని, అవసరంలో ఉన్న చిన్నారులను ఆదుకునేందుకు తాను చెప్పిన మాటలు మీకు నచ్చకపోయి ఉండొచ్చని పేర్కొంది. ఆ పెయింటింగ్ తనదీ కాదని, వారిదీ కాదని అది సాయం చేసేందుకు మాత్రమే అని మండిపడింది.