ధోని అంటే ఎందుకిష్టమో చెప్పిన సన్నీ లియోన్ - MicTv.in - Telugu News
mictv telugu

ధోని అంటే ఎందుకిష్టమో చెప్పిన సన్నీ లియోన్

March 14, 2019

టీంఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.. కూల్‌నెస్, ఫ్యామిలీ మ్యాన్ నేచర్‌కు బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఫిదా అయిపోయింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరని అడగ్గా.. వెంటనే ‘కెప్టెన్‌ కూల్‌’ మహేంద్ర సింగ్‌ ధోనీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. ఎందుకు? అని అడగ్గా.. ధోనీ ఫ్యామిలీ పర్సన్‌ అని ఆయనలో తనకు నచ్చే విషయం అదేనని తెలిపింది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం కోసం ఏదో రకంగా సమయం కేటాయించుకుంటారని పేర్కొంది. ధోని కుమార్తె జీవాతో కలిసి దిగే ఫొటోలంటే తనకు చాలా ఇష్టమని, చాలా క్యూట్‌గా ఉంటాయని పేర్కొంది. చివరిగా ‘తేరా ఇంత్‌జార్’ అనే చిత్రంతో సన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు టీవీ షోలు, మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు దక్షిణాది సినిమాలు ఉన్నాయి. హిందీలో నటించబోయే సినిమాకు ఆమె నిర్మాతగా వ్యవహరించనున్నారు.

Sunny Leone has the sweetest reason why MS Dhoni is her favourite cricketer