సన్నీలియోనికి శునక వియోగం.. - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోనికి శునక వియోగం..

February 2, 2018

మాజీ పోర్న్ నటి,  బాలీవుడ్ ఐటమ్ గర్ల్ సన్నీలియోనికి విషాదంలో మునిగిపోయింది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చాపర్ చనిపోయింది. ఈ సంగతిని ఆమె సోషల్ మీడియాతో పంచుకుంది. చాపర్ ఫోటోను పోస్ట్ చేసి, దానితో తన స్మృతులను నెమరేసుకుంది.

మన బెస్ట్ ఫ్రెండ్స్ చనిపోతే ఆ బాధను మాటల్లో చెప్పలేమని ట్విటర్లో పేర్కొంది. ‘నీ డాడ్ డానియ‌ల్ వెబ‌ర్‌తో క‌లిసి 15 ఏళ్ళు నువ్వు బతికారు. నీతో నేను పదేళ్లు కలసి ఉన్నాను.. అందుకు నేను లక్కీ. నువ్వు సైనికుడివి, యోధుడివి. నువ్వు పైనుంచి ఎప్పటికీ మావైపు చూస్తుంటే దేవదూతవు.. లవ్ యూ చాపర్.. రిప్.. ’ అని సన్నీ ట్వీట్ చేసింది.