కంగనకు సన్నీలియోన్ వాత.. నాలుగు లక్షల లైకులు - MicTv.in - Telugu News
mictv telugu

కంగనకు సన్నీలియోన్ వాత.. నాలుగు లక్షల లైకులు

September 19, 2020

sunnyy

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత కంగనా రనౌత్ బాలీవుడ్‌పై  ఘాటుగా స్పందించింది. బడా నటులను ఏకి పారేయడంతో చాలా మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ వ్యవహారం కాస్తా మలుపు తీసుకొని ఇప్పుడు ఆమెకు రివర్స్ అవుతున్నాయి. రోజుకొకరిని టార్గెట్ చేస్తూ పెడుతున్న ట్వీట్లతో కథ అడ్డం తిరిగింది. ఇటీవల నటి ఊర్మిళా మంతోండ్కర్ వివాదంలో సన్నీలియోన్ పేరు లాగిన కంగన ఆమెతో చివాట్లు తినాల్సి వచ్చింది. గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో నెటిజన్లు కూడా సన్నీలియోన్‌కు మద్దతు ప్రకటించారు. 

sunnyy

ఊర్మిళను విమర్శించేందుకు కంగన ఆమెను ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్‌గా పేర్కొంది.  సన్నీ లియాన్ వంటి అడల్ట్ స్టార్ ను కూడా భారత సినీ పరిశ్రమ స్వాగతించింది అంటూ అభిప్రాయపడింది. దీనిపై సన్నీ తీవ్రంగా స్పందించింది. అనవసరంగా తన పేరును తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘నా గురించి ఎంతో తక్కువ తెలిసిన వాళ్లు, ఎంతో ఎక్కువ మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది’ అంటూ పరోక్షంగా విమర్శించింది. దీనికి దాదాపు 4 లక్షలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ఇప్పటి వరకు కంగనకు అనుకూలంగా ఉన్న వారు కూడా ఆమె మాటలపై అభ్యంతరం చెబుతున్నారు.