జంతువుల కోసం సన్నీ న్యూడ్ షూట్ - MicTv.in - Telugu News
mictv telugu

జంతువుల కోసం సన్నీ న్యూడ్ షూట్

November 29, 2017

అడల్డ్ చిత్రాల నుంచి మామూలు చిత్రాల్లో జంప్ చేసి ఐటం సాంగ్‌లతో  ఉర్రూతలూగిస్తున్న సన్నీలియోని ఏం చేసినా సంచలనమే. మొన్న కొచ్చికి ఆమె వచ్చినప్పుడు లక్షల సంఖ్యలో జనం ఎగబడ్డారు. ఆమె కనిపించిన కండోమ్ ప్రకట గుజరాత్‌లో గొడవ రేపింది.

అయితే ఈ పాపులారిటీని ఆమె తన సంక్షేమానికే కాకుండా జంతువుల సంక్షేమం కోసం కూడా వాడుతున్నారు. ప్రముఖ జంతు హక్కుల సంస్థ ‘పెటా’ కోసం తన భర్త డానియేల్ వెబ‌ర్‌తో క‌లిసి న‌గ్నంగా దర్శనమిచ్చింది. మొస‌ళ్లపై, గొర్రెలపై సాగుతున్న హింస నిరోధం కోసం ఈ ప్రకటన విడుదల దేశారు. మొసలి చర్మాన్ని, గొర్రె ఉన్నిని ఎంత హింసించి తీస్తారో ఈ వీడియో చూపారు. జంతు చ‌ర్మాల‌తో త‌యారుచేసే దుస్తులను వేసుకోవద్దని సన్నీ దంపతులు ప్రచారం చేశారు.