ఆయనలో కూడా ఓ మనసున్న మగాడు వున్నాడు ! - MicTv.in - Telugu News
mictv telugu

ఆయనలో కూడా ఓ మనసున్న మగాడు వున్నాడు !

June 10, 2017


‘ మేరీ బేటీ సన్ని లియోని బన్నా చాహ్తీ హై ’ అనే షార్ట్ ఫిలింతో హల్ చల్ చేసిన రాంగోపాల్ వర్మ తనదైన మేకింగ్ స్టైల్లో చాలా మంది పురుషహంకారుల్లో ఆలోచనలు రేకెత్తించాడు. స్త్రీవాదాన్ని చాలా బలంగా లేవనెత్తాడు. ఆడవాళ్ళు ఇలాగే వుండాలి అని మగవాళ్ళు పురాణాలు, గ్రంథాలు రాసి యుగాలుగా, తరతరాలుగా స్త్రీ స్వేచ్ఛను హరించారు. ఎంతకాలం ఆడది మగవాడి మోచేతి కింద నీళ్ళు తాగాలి, తన అస్థిత్వాన్ని చంపుకొని నిస్సహాయురాలిగా ఎంతకాలం నలుగుతూనే వుండాలి ? తండ్రిగా, అన్నా – తమ్ముడిగా, భర్తగా, కొడుగ్గా.., మగవాడు మగువని ఎంత కాలం శాసిస్తాడు ? ఏ.. ఆడది మగవాడి అండ లేకుండా బతకలేదా ? మగాడి అవసరమే లేకుండా మహిళ తన ఉన్నతిని చాటుకోలేదా ? సంప్రదాయపు ఉచ్ఛులో ఆడదాన్ని అనాదిగా బలిపశువును చేసి ఆడుకుంటున్న తీరుని ఈ చిన్న షార్ట్ ఫిలింలో అద్భుతంగా చూపించాడు వర్మ !

ఏముంది ఈ షార్ట్ ఫిలింలో

ఓవరాల్ గా ఈ షార్ట్ ఫిలింని  గమనిస్తే ఒకటే సీన్లో తల్లిదండ్రులు, కూతురికి మధ్య సుదీర్ఘమైన డిస్కషన్ వుంటుంది. కూతురిది ఈతరానికి భిన్నమైన భావజాలం, కన్నవాళ్ళవి అవే రొడ్డకొట్టుడు భావజాలాలు. స్టార్టింగ్ స్టార్టింగే కూతురు నేను సన్నిలియోన్ని అవుతానంటుంది. నీకేమన్న పిచ్చా ? సన్ని లియోని అంటే ఏమనుకుంటున్నావ్ ? అని పేరెంట్స్ కూతురి మైండ్ సెట్ ని మార్చడానికి ప్రయత్నిస్తారు. బట్ కూతురు మాత్రం తన వాదాన్ని కన్నవాళ్ళకి చాలా బలంగా వినిపిస్తుంది. ఒక ఇంజనీరు, ఒక డాక్టర్, ఒక పైలట్ లానే సన్నిలియోని కూడా ఒక పోర్న్ స్టార్ అంటుంది . పోయి పోయి తమ కూతురు సన్నిలియోని అవుతానంటుందేంటని నరకానికి పోతావ్ నువ్వు అంటారు. సంప్రదాయం, ఆచారం, సంస్కృతి, తొక్క, తోటకూర అని మా ఆడవాళ్ళని మగాళ్ళు దబాయిస్తున్నారు. ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. అనాదిగా ఆడవాళ్ళ లైఫ్ ఇంతే అని తల్లి వాదిస్తుంటుది.

కాదూ మనల్నలా ఆలోచించేలా, ఆచరించేలా తయారు చేసారు ఈ మగాళ్ళు అంటుంది కూతురు. తల్లి కోపంగా కూతురి చెంప పగులగొడుతుంది. అప్పుడు తను.. ప్రశ్నకు సమాధానం లేనప్పుడే ఇలా చేయి చేస్కుంటారని చురక వేస్తుంది. నిన్ను నువ్వు బజారు సరుకులా అమ్ముకుంటానంటావన్న తండ్రి క్వశ్చన్ కి అవునూ తప్పేముందీ.. ఒక కళాకారుడు తమ కళను అమ్ముకుంటున్నాడు, ఒక కూలీ తన కష్టాన్ని క్యాష్ చేస్కుంటున్నప్పుడు సన్నిలియోని తన సెక్స్ అప్పీల్ ని పైసాగా మారుచకుంటోందంటుంది. ఆడవాళ్ళను కట్టు బానిసలుగా మార్చింది కేవలం ఈ పురుష భావజాలం, ఇలా వుండాలి, అలా వుండాలని ఆంక్షల హద్దులు పెట్టి తీవ్రంగా అణిచివేస్తున్నారని, తనలో వున్న సెక్స్ అప్పీల్ ను అమ్మాయెందుకు క్యాష్ చేస్కోవద్దు, మగవాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు ఎన్ని అక్రమ సంబంధాలైనా పెట్టుకోవచ్చు కానీ ఆడది మాత్రం అలా చేస్తే మహా పాపం అంటారు. పైగా ఎవడో పోకిరీ నా కొడుకులు నన్ను ఒంటరిగా పట్టుకొని గ్యాంగ్ రేప్ చేసి నన్ను అతి క్రూరంగా చంపడం కన్నా ముందే నేనే సెక్స్ సింబల్ గా మారిపోతే అలాంటివాళ్ల సరదా తీర్చి నేను కూడా నా సరదా తీర్చుకుంటాను. వ్యక్తి ఎంతో డెవ్ లప్ అవుతున్నాడు వ్యవస్థ కూడా చాలా డెవ్ లప్ అవుతోంది కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ కల్చర్ అనే ముసుగులో ఎంత కాలం తమ అస్థిత్వాలను చంపుకొని జీవచ్ఛవాలుగా బతకాలని ? ఆడది మగాడి అండ లేకుండా ఒంటరిగా స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకలేదా ? ఈ ఆంక్షలు, కట్టుబాట్లు కేవలం ఆడవాళ్ళకే ఎంతకాలం ? ? ?వంటి ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది కూతురు. కూతురి మనసుని అస్సలు అర్ధం చేస్కోరు తల్లిదండ్రలు. తమ కూతురు తప్పటడుగు వేస్తోందని చాలా రకాలుగా నచ్చజెప్ప జూస్తారు గానీ కూతురు తన బ్రాడ్ మైండు సెట్టును అస్సలు మార్చుకోదు.  క్లైమాక్స్ లో తల్లిని కూడా స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తుంది.

సాంప్రదాయుల వాదన 

అయితే ఈ షార్ట్ ఫిలింపై చాలా దూమారం రేగుతోంది. స్త్రీవాద రచయిత్రులు గానీ సామాజిక కార్యకర్తలు గానీ, ఇతర  సామాజికి వాదులు ఈ సిన్మాను పాజిటివ్ వేలోనే తీస్కుంటున్పారు. ఆయనలో కూడా ఓ మనసున్న మగాడు వున్నాడని అంటున్నారు.  గానీ సాంప్రదాయ వాదులు మాత్రం చాలా తీవ్రంగా వర్మ మీద విరుచుకు పడుతున్నారు. ఆడవాళ్ళ స్వేచ్ఛ అనే పదాన్ని అడ్డు పెట్టుకొని వర్మ ఏం చెప్పాడిందులో.. రాక్షసమైన మృగాళ్ళ కామ దాహాన్ని తీర్చే ఆట బొమ్మ అవమని ఇండైరుక్టుగా చెప్పాడని చాలా బలంగా ఖండిస్తున్నారు

!https://www.youtube.com/watch?v=jIOoK2QJ26I&t=307s

!- సంఘీర్