సన్నీలియోన్ కి కూతురు...! - MicTv.in - Telugu News
mictv telugu

సన్నీలియోన్ కి కూతురు…!

July 21, 2017

అదేంటి సన్నీలియోన్ కు ఓ పాప కూడా ఉందా అని పర్శాన్ అయితున్రు గదా..?అవును ఉంది  కానీ నవమాసాలు మోసి, కని పెంచిన పాప కాదు..ప్రేమతో అక్కున చేర్చుకున్న పాప.అసలు ముచ్చటేందంటే  సన్నీలియోన్ దంపతులు ఓ అనాథాశ్రమం నుంచి ఆడపిల్లను దత్తత తీసుకున్నారు.పాపకి నిషా కౌర్‌ వెబర్‌ అని పేరు పెట్టారు.ఆ పేరు పెట్టడానికి ఓ కారణం ఉందండోయ్,సన్నీ అసలు పేరు కరణ్‌జీత్‌ కౌర్‌ వోరా. దాంతో తన పేరులోని కౌర్‌,భర్త పేరులోని వెబర్‌ పదాలు కలిసేలా పాపకు ఆ పేరు పెట్టారు.సాధారణంగా ఈ సంతోషాన్ని అనుభవించడానికి ఏ తల్లిదండ్రులకైనా తొమ్మిది నెలలు పడుతుంది. కానీ మాకు మూడు వారాలే పట్టింది,నేనో బిడ్డని దత్తత తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అనాథాశ్రమంలో కొందరు చేస్తున్న సేవను చూసి..అక్కడి పిల్లలను చూసి నా మనసు మార్చుకున్నాను అని చెప్పింది సన్నీలియోన్.అంతేకాదు  ఓ తల్లిగా తన బిడ్డ పట్ల ప్రతీ బాధ్యతను దగ్గరుండి చూసుకుంటానని చెప్పింది.నిజంగా సన్నీలియోన్ ది ఎంత గొప్ప మనసో కదా.. బ్యూటీ విత్ బ్యూటిఫుల్ హర్ట్ అంటే బహుశా ఇదేనేమో.హాట్సాఫ్ టు సన్నీ..