చిత్తుగా ఓడిన సన్‌ రైజర్స్, ఢిల్లీ.. చెన్నై, ఆర్‌సీబీ అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

చిత్తుగా ఓడిన సన్‌ రైజర్స్, ఢిల్లీ.. చెన్నై, ఆర్‌సీబీ అదుర్స్

May 9, 2022

ఐపీఎల్ 15 సీజన్ మ్యాచ్‌లు కీలక దశకు చేరుకున్నాయి. ఫ్లేఆఫ్స్‌కి చేరే సమయం ఆసన్నమైంది. దీంతో మొదట్లో దంచికొట్టిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు పలు మ్యాచ్‌ల్లో వరుసగా చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం మొదటగా సన్ రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్లు మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో బెంగుళూరు నిర్ధేశించిన 193 పరుగుల లక్ష్యఛేదనలో 67 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. హసరంగ 5 వికెట్లతో సన్ రైజర్స్‌ను దెబ్బ తీశాడు. దాంతో, సన్ రైజర్స్ 19.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. చెన్నై సూపర్ కింగ్స్ శివాలెత్తింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. 91 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. ప్లేఆఫ్స్ కు చేరాలని కలలు కన్నా ఢిల్లీని దారుణంగా దెబ్బతీసింది. తొలుత బ్యాట్‌తో ఇరగదీసిన చెన్నై ఆ తర్వాత బంతితోనూ విజృంభించింది. చెన్నై ఆరు వికెట్ల నష్టానికి 208 భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ, 117 పరుగులకే ఆల్‌ ఔట్ అయింది.