ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ సెంచరీ మ్యాచ్‌ - MicTv.in - Telugu News
mictv telugu

ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ సెంచరీ మ్యాచ్‌

April 14, 2019

ఐపీఎల్ సీజన్ ఆసక్తి కరంగా సాగుతోంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సన్‌రైజర్స్‌కు ఎంతో ప్రత్యేకమైనంది. ఈ రోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌‌తో సన్ రైజర్స్ వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ మ్యాచ్‌ను సన్ రైజర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైన గెలుపు కైవసం చేసుకుని సెంచరీ కొట్టేయాలని భావిస్తోంది.

Sunrisers Hyderabad Team Century Match In Indian Premier league At Hyderabad Uppal Stadium

ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ.. హైదరాబాద్ జట్టు ఎంతో పటిష్టంగా ఉందని, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కూడా ఫిట్‌నెస్ సాధించడంతో ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశముందని పేర్కొన్నాడు. ప్రత్యేకమైన మ్యాచ్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లో గెలుపు సాధిస్తుందని మూడీ ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది ఐపీఎల్ సీజన్‌లో తమ జట్టులో ఉన్న శిఖర్ ధావన్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాడని, ప్రస్తుతం తమకు ధావన్ కు స్నేహం మాత్రమే ఉందని, అతనిపై గట్టి పోటీని చూపిస్తామని తెలిపాడు.

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది.