తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ఎక్కువగా ఈ జిల్లాలోనే.. - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ఎక్కువగా ఈ జిల్లాలోనే..

March 17, 2022

kkk

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడే ఇంత తీవ్రంగా ఉంటే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉండబోతుందని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ సందర్భంగా ఈనెలలో ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం, భద్రాచలం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 40 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్గొండ జిల్లాలో ఎండ సెగలు కక్కుతుంది. దీంతో జిల్లాలో రికార్డ్ స్థాయిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సూర్యుడి ప్రతాపానికి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఆదిలాబాద్‌కు వస్తున్న వారు ఉదయం 11గంటల లోపే పనులు ముగించుకుని ఇంటి దారి పడుతున్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి సింగరేణి ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత విపరీతమైన వేడిగాలులతో జనం విలవిలాడుతున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్‌ల్లో భానుడి ప్రతాపానికి సింగరేణి కార్మికులు అల్లాడిపోతున్నారు.